PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

స్టాక్‌ మార్కెట్‌లో ఫ్లాట్‌ ట్రేడ్‌ – సెన్సెక్స్ 65100 పైన, నిఫ్టీ 19450 వద్ద ప్రారంభం

[ad_1]

Share Market Opening on 08 November 2023: ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌లో కొద్దిగా హుషారు కనిపిస్తోంది. ఈ రోజు (బుధవారం) స్వల్ప పెరుగుదలతో మార్కెట్లు ముందుకు సాగుతున్నాయి. సెన్సెక్స్ & నిఫ్టీ బుల్లిష్‌ ఓపెనింగ్‌ అందించాయి. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌లో అప్‌వార్డ్‌ ట్రెండ్‌ ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఓపెనింగ్‌ టైమ్‌లో బ్యాంక్ నిఫ్టీలో పచ్చదనం కనిపించినా, నామమాత్రపు వృద్ధి కారణంగా దాన్నుంచి ఓవరాల్‌ మార్కెట్‌కు పెద్దగా సపోర్ట్‌ లభించలేదు.

ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ ఇలా ఉంది..
నిన్న (మంగళవారం) 64,942 వద్ద ఆగిన BSE సెన్సెక్స్, ఈ రోజు 159.55 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 65,101 వద్ద స్టార్ట్‌ అయింది. నిన్న 19,407 వద్ద ముగిసిన NSE నిఫ్టీ, ఈ రోజు 42.90 పాయింట్లు లేదా 0.22 శాతం స్వల్ప పెరుగుదలతో 19,449 స్థాయి వద్ద ప్రారంభమైంది.

అడ్వాన్స్‌ – డిక్లైన్‌ రేషియో
ఉదయం 9.30 గంటలకు, BSEలో 2774 స్టాక్స్‌ ట్రేడ్ అవుతుండగా, వాటిలో 1,972 కౌంటర్లు గ్రీన్‌ మార్క్‌లో ఉన్నాయి. 716 స్క్రిప్స్‌ రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. అడ్వాన్స్-డిక్లైన్ రేషియోను బట్టి మార్కెట్ మొమెంటం సానుకూలంగా కనిపిస్తుంది.

సెన్సెక్స్ ప్యాక్‌ పరిస్థితి
ఈ రోజు ట్రేడ్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 20 షేర్లు లాభపడగా, 10 షేర్లు క్షీణించాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో ఏషియన్ పెయింట్స్ 1.16 శాతం, విప్రో 0.55 శాతం, ఎల్ అండ్ టీ 0.40 శాతం, సన్ ఫార్మా 0.39 శాతం, మారుతి సుజుకి 0.37 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.72 శాతం పడిపోయింది. బజాజ్ ఫైనాన్స్ 0.44 శాతం, కోటక్ మహీంద్ర బ్యాంక్ 0.35 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.30 శాతం, టాటా స్టీల్ 0.25 శాతం చొప్పున క్షీణించాయి.

సెక్టోరల్ ఇండెక్స్ పరిస్థితి
నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో… బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రమే ట్రేడ్‌లో క్షీణతను చూస్తున్నాయి. మిగిలిన అన్ని రంగాలు బుల్లిష్ జోన్‌లో ఉన్నాయి. మార్కెట్‌ ఓపెనింగ్‌ ట్రేడ్‌లో, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 0.90 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌ 0.84 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.80 శాతం, రియల్టీ ఇండెక్స్‌ 0.54 శాతం పెరిగాయి.

ఉదయం 10 గంటల సమయానికి మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. నిఫ్టీ 20.70 పాయింట్లు లేదా 0.11% గ్రీన్‌ మార్క్‌తో 19,427 స్థాయి వద్ద కదులుతోంది. సెన్సెక్స్‌ 8.10 పాయింట్లు లేదా 0.012% పెరిగి 64,950 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

లాభపడ్డ అమెరికన్‌ స్టాక్స్
వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ నుంచి మరింత స్పష్టత కోసం పెట్టుబడిదార్లు ఎదురు చూస్తున్న నేపథ్యంలో, US ట్రెజరీ ఈల్డ్స్‌లో తిరోగమనం కారణంగా S&P 500, నాస్‌డాక్‌ మంగళవారం పెరిగాయి. 

పెరిగిన ఆసియాన్‌ స్టాక్స్
బిగ్ టెక్‌లో ర్యాలీ US స్టాక్స్‌ను రెండేళ్లలో గరిష్ట లాభాలకు తీసుకెళ్లడంతో, ఆ సంకేతాలను అనుసరించి ఆసియా స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *