[ad_1]
Indian Bank Special FD Rate Schemes: చెన్నై ప్రధాన కేంద్రంగా పని చేసే ప్రభుత్వ రంగ ‘ఇండియన్ బ్యాంక్’, దీపావళి కానుకగా, కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయం తీసుకుంది. తన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) పథకాలను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది, గతంలో ఈ గడువు అక్టోబర్ 31 వరకే ఉంది. ఈ PSU బ్యాంక్, అధిక ఇంట్రస్ట్ రేటుతో రెండు ప్రత్యేక FD స్కీమ్స్‌ను ప్రస్తుతం రన్ చేస్తోంది.
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FD స్కీమ్స్:
1. ఇండ్ సూపర్ 400 డేస్ స్కీమ్ (IND SUPER 400 DAYS):
ఇండియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రత్యేక రిటైల్ టర్మ్ డిపాజిట్ “ఇండ్ సూపర్ 400 డేస్”, కాలబుల్ ఆప్షన్‌తో (మెచ్యూరిటీకి ముందే డిపాజిట్‌ను రద్దు చేసుకునే ఆప్షన్) ఉన్న FD/MMD ఇది. 400 రోజుల కాల పరిమితితో, రూ. 10,000 నుంచి రూ. 2 కోట్ల కంటే తక్కువ పెట్టుబడిపై అధిక వడ్డీ రేటును ఈ స్కీమ్ ఆఫర్ చేస్తోంది.
ఈ పథకం కింద, సాధారణ వ్యక్తులు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.25% వడ్డీ రేటును పొందుతారు. సీనియర్ సిటిజన్లు సాధారణ కేటగిరీ కంటే 0.50% కంటే ఎక్కువ ఆదాయం (7.75%) అందుకుంటారు.
అంతేకాదు, సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం ఒక స్పెషల్ కేటగిరీని కూడా ఇండియన్ బ్యాంక్ రన్ చేస్తోంది. ఇక్కడ, సూపర్ సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ల కంటే 0.25% ఎక్కువ వడ్డీని, సాధారణ ప్రజల కంటే 0.75% ఎక్కువ రాబడిని డ్రా చేస్తారు. గరిష్టంగా సంవత్సరానికి 8% వడ్డీ ఆదాయం పొందుతారు.
2. ఇండ్ సుప్రీం 300 డేస్ (IND SUPREME 300 DAYS):
స్పెషల్ టర్మ్ డిపాజిట్ “ఇండ్ సుప్రీం 300 డేస్” కూడా, పెట్టుబడి మీద ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. రూ. 5000 నుంచి రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లు దీని కిందకు వస్తాయి. కాల పరిమితి 300 రోజులు. కాలబుల్ ఆప్షన్‌తో ఈ ఎఫ్‌డీని బ్యాంక్ అందిస్తోంది.
ఈ స్కీమ్ కింద, ఇండియన్ బ్యాంక్ 300 రోజుల కాలవ్యవధి కోసం సాధారణ ప్రజలకు 7.05% వడ్డీని చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లు మరో 0.50% ఎక్కువ రేటుతో 7.55% సంపాదిస్తారు. సూపర్ సీనియర్ సిటిజన్లు 7.80% రాబడిని పొందుతారు. ఈ స్కీమ్‌లో కూడా, సూపర్ సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ల కంటే 0.25% ఎక్కువ, సాధారణ ప్రజల కంటే 0.75% ఎక్కువ వడ్డీని డ్రా చేస్తారు.
ఇక్కడ, సాధారణ వ్యక్తులు అంటే 60 సంవత్సరాల వయస్సు లోపు వాళ్లు; సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు & అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 80 ఏళ్లు & అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లు.
NRE టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు NRE అకౌంట్స్‌కు సంబంధించిన RBI మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి.
ఇది కాకుండా, రూ.10 కోట్ల వరకు విలువైన సీనియర్ సిటిజన్ల డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు అదనంగా 0.50% ఉంటుందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. షార్ట్ టర్మ్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మనీ మల్టిప్లైయర్ డిపాజిట్ స్కీమ్‌లకు సంబంధించి, 15 రోజుల నుంచి 10 సంవత్సరాల డిపాజిట్ల మీద కార్డ్ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటును బ్యాంక్ చెల్లిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఆదివారం స్టాక్ మార్కెట్‌లో స్పెషల్ ట్రేడింగ్, కేవలం గంట పాటు అనుమతి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply