హార్ట్‌ పేషెంట్స్‌.. ఈ యోగాసనాలు వేయకూడదు..!

[ad_1]

చక్రాసనం..

చక్రాసనం..

చక్రాసనంలో వక్తి.. అర్ధ వృత్తాకార భంగిమలో వెనుకకు వంగి ఉంటాడు. ఈ ఆసనం చక్రాన్ని పోలి ఉంటుంది. చక్రాసనం వెన్నెముక వశ్యతను మెరుగుపరుస్తుంది. మధుమేహం, శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు మేలు చేస్తుంది. కానీ ఈ భంగిమలో, గుండె చాలా వేగంగా రక్తాన్ని పంప్ చేయవలసి ఉంటుంది. ఈ ఆసనం గుండెను మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ పరిస్థితి హార్ట్‌ పేషెంట్స్‌కు మంచిది కాదు.​

Health Care:క్యాబేజీ పచ్చిగా తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

హలాసనం..

హలాసనం..

ఈ ఆసనంలో శరీరం నాగలి మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఆసనంలో వెల్లకిలా పడుకొని, చేతులను తిన్నగా చాపి, అరచేతులను నేలకు తాకించి ఉంచాలి. కాళ్లను పైకి లేపి, మడమలను పిరుదులకు తాకించాలి. మోకాళ్లను పొట్ట వద్దకు తేవాలి. ఈ ఆసనం అన్ని గ్రంథులకు చైతన్యం కలిగిస్తుంది. మధుమేహులకు మేలు చేస్తుంది. వెన్నెముక, పిరుదులు, నడుమును బలోపేతం చేస్తుంది. అయినప్పటికీ, గుండె సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనం వేయకూడదు. ఈ ఆసనంలో గుండె శరీరం దిగువ భాగానికి రక్తాన్ని పంపించడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని ప్రసరిస్తుంది.

Bone Health: ఈ ఆహారాలు ఎక్కువగా తింటే.. కాల్షియం లోపిస్తుంది..!

శీర్షాసనం..

శీర్షాసనం..

ఈ ఆసనంలో తల కిందకు, కాళ్లు పైకి ఉంటాయి. ఈ ఆసనం తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది, వెర్టిగోకు చికిత్స చేస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. శరీరం రివర్స్‌ పొజీషన్‌లో ఉన్నప్పుడు.. దిగువ భాగానికి రక్తాన్ని పంప్‌ చేయడం గుండెకు కష్టం అవుతుంది.

పాదహస్తాసనం..

పాదహస్తాసనం..

ఇది ఫార్వర్డ్ బెండ్ పోజ్. దీనిలో కాళ్లను నిటారుగా ఉంచుతూ తుంటి నుంచి ముందుకు వంగాలి. ఈ భంగిమ రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది. గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌ ఉన్నవారి ఈ ఆసనం వేయవద్దు.

సర్వంగాసనం..

సర్వంగాసనం..

ఈ ఆసనంలో, మీరు మీ శరీరాన్ని మీ భుజాలపై సమతుల్యం చేసుకోవాలి. ఈ ఆసనం చేతులు, భుజాలను బలపరుస్తుంది, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. థైరాయిడ్ గ్రంధులను ప్రేరేపిస్తుంది. అయినప్పటికీ, ఈ ఆసనం గుండె రోగులకు మంచిది కాదు, ఎందుకంటే రక్తాన్ని ప్రసరించడానికి గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *