హైవేలపై కారు నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే – లేకపోతే జేబుకు చిల్లు ఖాయం!

[ad_1]

Vehicle Driving on Highway: ఇప్పుడు దేశంలో ఎన్నో అద్భుతమైన హైవేలు ఉన్నాయి. వాటి సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు వాటిపై నడుస్తున్న వాహనాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అటువంటి పరిస్థితిలో హైవేలపై వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి రోడ్లపై నడిపేటప్పుడు వేగం కూడా ఎక్కువగా ఉంటుంది.

అధిక వేగాన్ని నివారించండి
హైవేలపై సాధారణంగా చాలా దూరం ప్రయాణం చేస్తాం. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ ప్రయాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి వారి కారును అధిక వేగంతో నడుపుతారు. దీని కారణంగా మొదటి నష్టం మీ జేబుకు ఓవర్ స్పీడ్ రూపంలో కలుగుతుంది. ఇక రెండోది అధిక వేగం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే హైవేపై నిర్ణీత వేగ పరిమితిలో నడవడం మంచిది. దీని కారణంగా అనుకోని పరిస్థితుల్లో మీ వాహనాన్ని నియంత్రించవచ్చు.

సరైన లేన్‌లో ఉండండి
దేశంలో నిర్మించిన చాలా ప్రధాన రహదారులు/ఎక్స్‌ప్రెస్‌వేలు నాలుగు లేన్‌లను కలిగి ఉన్నాయి. చాలా మందికి సరైన లేన్ ఏది అన్నది తెలియదు. కొన్నిసార్లు ఇది కూడా ప్రమాదానికి కారణం అవుతుంది. హైవేపై ఇచ్చిన లేన్‌లో ట్రక్కులు మొదలైన పెద్ద వాహనాలకు ఎడమ వైపు లేన్. ఎడమ నుంచి కుడికి రెండో లేన్ బస్సులకు, మూడో లేన్ కార్లు వంటి చిన్న వాహనాలకు ఉంటుంది. మరోవైపు డివైడర్‌ వైపు ఉండే నాలుగో లేన్‌ను ఓవర్‌టేకింగ్ లేన్ అని పిలుస్తారు ఈ లేన్ ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇండికేటర్‌ను ఉపయోగించడం అవసరం
ఇండికేటర్ ఉపయోగం ప్రతిచోటా ఒకేలా ఉన్నప్పటికీ హైవేలో ఇది మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే హైవేపై నడిచే వాహనాల వేగం చాలా ఎక్కువగా ఉండడం వల్ల రెప్పపాటులో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే లేన్ మార్చే ముందు ఇండికేటర్ ఇవ్వండి. తద్వారా మీ వెనుక నడుస్తున్న వాహనాలకు మీ యాక్టివిటీ గురించి తెలుస్తుంది. మీ లేన్‌ని సురక్షితంగా మార్చుకోవచ్చు.

డ్రైవింగ్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి
హైవే మీద ప్రయాణించే చాలా మంది చాలా దూరం ప్రయాణిస్తారు. అందుకే చాలా మంది కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా కాకుండా మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటారు. తద్వారా మీరు కూడా ఫ్రెష్‌గా ఉంటారు. కారుకు కూడా రెస్ట్ దొరుకుతుంది.

అలాగే ఓవర్ టేక్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మీరు ఓవర్ టేక్ చేసేటప్పుడు మీ బైక్ మిర్రర్స్, పక్కగా ఎవరైనా వస్తున్నారేమో అని ముందుగా చూసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే.. పక్కగా వెళ్లే వాహనాన్ని ఢీకొనడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. ఓవర్ టేక్ చేసేటప్పుడు ఇండికేటర్ కచ్చితంగా వేయాల్సిందే. రైట్ నుంచి ఓవర్ టేక్ చేయడానికి కాస్త ఎక్కువ సేపు ముందు నుంచి ఇండికేటర్ వేస్తే వెనకాల వచ్చే వాహనాలు దానికి తగ్గట్లు మీ లేన్‌లోకి రాకుండా ఉంటాయి. ఓవర్ చేయడానికి 10 సెకన్ల ముందు ఇండికేటర్ వేస్తే సరిపోతుంది.

కర్వ్ దగ్గర, బ్లైండ్ బెండ్ దగ్గర ఓవర్ టేక్ చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మలుపుల దగ్గర అటువైపు నుంచి ఎవరు వస్తున్నారో మనకు కనిపించదు. కాబట్టి మలుపుల దగ్గర ఓవర్ టేక్ అస్సలు చేయకండి. మీరు వేగంగా వెళ్తూ, కంగారుగా ఉన్నప్పటికీ.. ఒకేసారి ఎక్కువ వాహనాలను ఓవర్ టేక్ చేయకండి. ఎందుకంటే మీరు మీ లేన్‌లోనే ఉన్న మరో వ్యక్తి కూడా ఓవర్ టేక్ చేయాలనుకుంటే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఓవర్‌టేకింగ్‌లో ఉన్న వాహనాన్ని అస్సలు ఓవర్ టేక్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం చాలా ఎక్కువ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *