హ్యుందాయ్ త్వరలో లాంచ్ చేయనున్న కార్లు ఇవే – ఎలక్ట్రిక్ వాహనాలు కూడా!

[ad_1]

దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ రాబోయే సంవత్సరాల్లో అనేక కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అల్కజార్, క్రెటా, కోనా ఈవీ వంటి దాని ప్రస్తుత మోడళ్లలో కొన్నింటిని కూడా అప్‌డేట్ చేయబోతోంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ మోడల్స్ 2024లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఇది కాకుండా హ్యుందాయ్ తన వెన్యూ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ కొత్త తరం మోడల్‌ను 2025లో లాంచ్ చేస్తుంది. ఇది కాకుండా క్రెటా ఈవీ, ఎక్స్‌టర్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఎక్స్‌టర్ ఈవీ ఎప్పుడు లాంచ్ కానుందనేది మాత్రం తెలియరాలేదు. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ వెర్నా ఎన్ లైన్‌తో సహా 2024 కోసం రెండు హ్యుందాయ్ మోడళ్లపై కంపెనీ పని చేస్తోంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరిలో లాంచ్ కానుంది. ఆ తర్వాత ఇది అధికారికంగా మార్కెట్లోకి రానుంది. క్రెటా కొలతలలో ఎటువంటి మార్పు ఉండదు. దీని డిజైన్ గ్లోబల్ స్పెక్ పాలిసేడ్ ఎస్‌యూవీ నుంచి ప్రేరణ పొందింది. ఇది క్యూబ్ లాంటి డిటైలింగ్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, నిలువు హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను కలిగి ఉంటుంది.

దీని ఇంటీరియర్ ఏడీఏఎస్ టెక్నాలజీతో సెక్యూరిటీ, కంఫర్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం కోసం ఫుల్లీ డిజిటల్ 10.25 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్‌గా 160 బీహెచ్‌పీ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 115 బీహెచ్‌పీ 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 115 బీహెచ్‌పీ 1.5 లీటర్ డీజిల్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

హ్యుందాయ్ వెర్నా ఎన్ లైన్
హ్యుందాయ్ త్వరలో వెర్నాకు సంబంధించిన ఎన్ లైన్ మోడల్‌ను తీసుకురానుంది. దీని ప్రొటోటైప్ ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపించింది. ఇది మార్కెట్లో స్టాండర్డ్ వెర్నా కంటే స్పోర్టియర్, పవర్‌ఫుల్ వేరియంట్‌గా ఉంటుంది.

కారు లోపల, వెలుపల స్పోర్టియర్ ఎలిమెంట్స్ సాధారణ మోడల్‌కు భిన్నంగా ఉంటాయి. డిజైన్ పరంగా ఇది టర్బో ట్రిమ్ మాదిరిగానే రెడ్ బ్రేక్ కాలిపర్‌లను, SX (O) ట్రిమ్ వంటి అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇది ఎన్ లైన్‌కు మరింత అథ్లెటిక్ టచ్ ఇస్తుంది. 160 బీహెచ్‌పీ పవర్, 253 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని పొందుతుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది.

వీటితో పోటీ?
లాంచ్ అయిన తర్వాత క్రెటా ఫేస్‌లిఫ్ట్… కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, ఎంజీ ఆస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *