10k మైలురాయిని క్రాస్‌ చేసిన మారుతి, ఈ స్పీడ్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు!

[ad_1]

Maruti Suzuki Share Price: ఆటో సెక్టార్‌ దిగ్గజం మారుతి సుజుకి ఈ రోజు (గురువారం, 31 ఆగస్టు 2023) కొత్త హైట్స్‌కు చేరింది. ఈ కంపెనీ షేర్‌ ధర తొలిసారిగా 10 వేల రూపాయల మైలురాయిని క్రాస్‌ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మారుతి సుజుకి షేర్ ప్రైస్‌ అప్‌ట్రెండ్‌లో ఉంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి దాదాపు రూ.8,200 స్థాయి దగ్గర్నుంచి, ఈ కౌంటర్‌ నిరంతరం లాభాలు కళ్లజూస్తూనే వచ్చింది. 

మారుతి సుజుకి షేర్ ధర ఈ రోజు ₹9,770 వద్ద ప్రారంభమైనా, వెంటనే బయ్యర్లను ఆకర్షించింది. NSEలో ఒక్కో షేర్‌ ₹10,065 దగ్గర ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది, ఇది దాని కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిని కూడా. కొత్త శిఖరాన్ని చేరుకోవడంతో, మారుతి సుజుకి షేర్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తన షేర్‌హోల్డర్లకు 22 శాతం లాభాలు అందించాయి.

ఈ ఆటో స్టాక్ మరింత పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం ప్రకారం… భారత ఆర్థిక వ్యవస్థ బాగుంది కాబట్టి ఆటో & బ్యాంకింగ్ స్టాక్స్‌లో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది, మారుతి సుజుకి షేర్ ధరలోనూ పెరుగుదల కనిపిస్తుంది. మారుతి సుజుకి షేర్‌ ప్రైస్‌ ధర సమీప కాలంలో ₹10,800 వరకు పెరగవచ్చని ఎక్స్‌పర్ట్స్‌ లెక్కగట్టారు.

మారుతి సుజుకి షేర్ ప్రైస్‌ టార్గెట్‌
“ఎకానమీలో ఉత్సాహం కారణంగా ఇతర సెగ్మెంట్ స్టాక్స్‌ కంటే ఆటో స్టాక్స్‌ ముందుకు దూసుకెళ్లాయి, మారుతి సుజుకి లాభపడుతోంది. ఇటీవల, భారీ స్థాయిలో GST వసూళ్లతో పాటు ఊహించిన దాని కంటే మెరుగైన GDP నంబర్లను ఇండియా సాధించింది. మెజారిటీ లిస్టెడ్ కంపెనీలు కూడా బలమైన Q1 ఫలితాలను ప్రకటించి మిగిలిన పనిని పూర్తి చేశాయి. సమీప కాలంలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నందున, ఈ అంశాలన్నింటి నుంచి మారుతి సుజుకి ప్రయోజనం పొందుతుంది” – ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్‌ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్

మరింత అప్‌సైడ్‌ కోసం ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేయాలని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా సలహా ఇచ్చారు. దాదాపు రూ.10,500, ఆ తర్వాత ₹10,800 చొప్పున ప్రైస్‌ టార్గెట్‌ కోసం హోల్డ్ చేయాలని సిఫార్సు చేశారు. అదే సమయంలో, ₹9,700 వద్ద కచ్చితమైన స్టాప్ లాస్‌ ఉంచుకోవాలన్నది ఆయన సూచన.

మారుతి సుజుకి Q1 రిజల్ట్స్‌
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో ₹2,485.1 కోట్ల స్టాండలోన్ నెట్‌ ప్రాఫిట్‌ను ప్రకటించింది. కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలోని ₹1,012.8 కోట్లతో పోలిస్తే ఈసారి భారీగా 145 శాతం పెరిగింది. భారీ సేల్స్‌ వాల్యూమ్‌, మెరుగైన రియలైజేషన్, ఖర్చుల తగ్గింపు ప్రయత్నాలు, హయ్యర్‌ నాన్ ఆపరేటింగ్ రెవెన్యూ కారణంగా ఇంత లాభం వచ్చింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం:క్రెడిట్‌ స్కోర్ తక్కువగా ఉందని లోన్ రిజెక్ట్‌ అయిందా?, ఈ టిప్స్‌ పాటిస్తే అప్పు పుడుతుంది

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *