[ad_1]
Tata Technologies IPO: 18 సంవత్సరాల విరామం తర్వాత, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు టాటా గ్రూప్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ లిమిటెడ్‌గా మారబోతోంది.
టాటా గ్రూప్‌లోని టాటా టెక్నాలజీస్ కంపెనీ (Tata Technologies Ltd), అతి త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రకటన చేసే అవకాశం ఉంది. హోమ్ గ్రోన్ ఆటో మేజర్ టాటా మోటార్స్‌కు (Tata Motors) అనుబంధ కంపెనీగా అన్ లిస్టెడ్ సెగ్మెంట్‌లో ఇది బిజినెస్ చేస్తోంది. ఈ కంపెనీలో తనకు ఉన్న మొత్తం వాటాలో కొంత భాగాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ మార్గంలో ఉపసంహరించుకోవడానికి టాటా మోటార్స్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. అంటే, టాటా టెక్నాలజీస్ IPO గురించి త్వరలోనే మనం ఒక ప్రకటన వినే అవకాశం ఉంది.
టాటా మోటార్స్‌కు 74.43 శాతం వాటా
గ్లోబల్‌గా ప్రొడక్ట్ ఇంజినీరింగ్, డిజిటల్ సర్వీసెస్ అందిస్తున్న కంపెనీ టాటా టెక్నాలజీస్. ప్రపంచంలోని చాలా దేశాలకు ఇది ఎగమతులు చేస్తోంది. 2022 మార్చి 31 నాటికి, టాటా టెక్నాలజీస్‌లో టాటా మోటార్స్‌కు 74.43 శాతం వాటా ఉంది.
“డిసెంబర్ 12, 2022న జరిగిన సమావేశంలో, టాటా మోటార్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా IPO కమిటీ ఏర్పాటైంది. మార్కెట్ పరిస్థితులు, వర్తించే అనుమతులు, రెగ్యులేటరీ క్లియరెన్స్‌లకు లోబడి అనుకూల సమయంలో IPO మార్గం ద్వారా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌లో పెట్టుబడిని టాటా మోటార్స్ పాక్షికంగా ఉపసంహరించుకుంటుంది” అని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ తెలిపింది.
News Reels
TCS తర్వాత ఇదే మొదటి IPO
టాటా టెక్నాలజీస్‌కు అన్ని వైపుల నుంచి గ్రీన్ సిగ్నల్స్ అందితే, 18 సంవత్సరాల తర్వాత వస్తున్న టాటా గ్రూప్ మొదటి IPO అవుతుంది. 2017 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత గ్రూప్ చైర్మన్ N చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో వచ్చే మొదటి IPOగానూ ఇది నిలిస్తుంది. దీంతో, మార్కెట్ కళ్లన్నీ ఈ కంపెనీ మీదే ఉన్నాయి.
టాటా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, ఇండియన్ IT మేజర్ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా గ్రూప్ నుంచి వచ్చిన చివరి IPO. 2004లో TCS పబ్లిక్‌లోకి వచ్చింది.
టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ టాటా ప్లే (TATA PLAY) కూడా IPO కోసం సిద్ధం అవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply