19,300 సపోర్ట్‌ బ్రేక్‌ చేసిన నిఫ్టీ – నష్టాలకు దారితీసిన బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లు

[ad_1]

Stock Market Closing 31 August 2023: 

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలే అందాయి. అయితే వర్షాభావ పరిస్థితులు, అదానీపై జార్జ్‌ సొరోస్‌ ఫండింగ్‌ చేసిన కంపెనీ ఆరోపణల వంటివి నెగెటివిటీకి దారితీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 93 పాయింట్లు తగ్గి 19,253 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 255 పాయింట్లు తగ్గి 64,831 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 82.78 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,087 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,178 వద్ద మొదలైంది. 64,723 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,277 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 255 పాయింట్ల నష్టంతో 64,831 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,347 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,373 వద్ద ఓపెనైంది. 19,223 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,388 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 93 పాయింట్లు తగ్గి 19,253 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ తగ్గింది. ఉదయం 44,265 వద్ద మొదలైంది. 43,895 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,399 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 243 పాయింట్ల నష్టంతో 43,989 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్సీ లైఫ్‌, సిప్లా, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌, బ్రిటానియా, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి  రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.25,930 వద్ద ఉంది.

Also Read: ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్‌ – అకౌంట్‌ వివరాల్ని మార్చడానికి ఇకపై డెడ్‌లైన్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *