News
lekhaka-Bhusarapu Pavani
2000
note:
రూ.2000
నోటును
ఉపసంహరించుకుంటున్నట్లు
RBI
ప్రకటించిన
అనంతరం..
గతంలో
నోట్ల
రద్దు
సమయంలో
అంతటి
ఇబ్బంది
తలెత్తలేదు.
దీనికి
ప్రధాన
కారణం
ఏమిటో
ఓ
సర్వేలో
తేల్చి
చెప్పింది.
భారతీయులలో
మూడింట
రెండు
వంతుల
మంది
ప్రజల
వద్ద
కనీసం
ఒక్క
2
వేల
కరెన్సీ
నోటు
సైతం
లేదని
అందులో
తేలింది.
అధిక
విలువ
కలిగిన
నోటు
వినియోగం
తగ్గుతోందని
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
(RBI)
చేసిన
ప్రకటన
సైతం
ఇదే
విషయాన్ని
ధృవీకరిస్తోంది.
కమ్యూనిటీ
సోషల్
మీడియా
ప్లాట్‌ఫారమ్
లోకల్
సర్కిల్స్
నిర్వహించిన
సర్వేలో
64
శాతం
మంది
తమ
వద్ద
2
వేల
నోటు
లేదని
తెలిపారు.
6
శాతం
మంది
తమ
వద్ద
లక్ష
కంటే
ఎక్కువ
పెద్ద
నోటు
రూపంలో
ఉన్నట్లు
వెల్లడించారు.
అయితే
ఈ
సర్వేలో
మొత్తం
12
వేల
121
మంది
పాల్గొన్నారు.
సమాధానమిచ్చిన
వారిలో
15
శాతం
మంది
వద్ద
20
వేల
వరకు,
7
శాతం
మంది
వద్ద
20
నుంచి
40
వేల
మధ్య,
6
శాతం
మంది
దగ్గర
40
వేల
నుంంచి
లక్ష
విలువైన
2
వేల
నోట్లు
ఉన్నట్లు
చెప్పారు.

దేశంలోని
341
జిల్లాల్లోని
భారతీయుల
నుంచి
తమ
సర్వేకు
57
వేలకు
పైగా
స్పందనలు
వచ్చినట్లు
లోకల్
సర్కిల్స్
తెలిపింది.
వారిలో
64
శాతం
పురుషులు
కాగా
మిగిలినవారు
మహిళలు.
2
వేల
నోటును
ఉపసంహరణ
కోసం
మే
19న
RBI
ప్రకటన
విడుదల
చేసిన
తర్వాత
91
శాతం
మంది
విక్రేతలు
దానిని
అంగీకరించడం
కష్టంగా
ఉన్నట్లు
తన
సర్వేలో
తేలినట్లు
పేర్కొంది.
2
వేల
నోటును
చలామణి
నుంచి
ఉపసంహరించాలన్న
RBI
నిర్ణయానికి
64
శాతం
మంది
మద్ధతు
తెలుపగా,
22
శాతం
మంది
వ్యతిరేకించారు.
సెప్టెంబర్
30
తర్వాత
ఈ
నోటు
చట్టబద్ధంగా
కొనసాగుతుందని
68
శాతం
మంది
విశ్వసిస్తున్నారు.
అంతే
శాతం
నోట్లు
మార్చుకోవడానికి
అనుమతి
ఇవ్వడాన్ని
తప్పుపట్టారు.
English summary
Local Circles survey results on 2000 note withdraw
Local Circles survey results on 2000 note withdraw..
Story first published: Saturday, May 27, 2023, 8:49 [IST]