2024లో బ్యాంకులకు నెలన్నర సెలవులు – ఈ లిస్ట్‌ను బట్టి మీ పనిని ప్లాన్‌ చేసుకోండి

[ad_1]

Bank Holidays List For 2024: ఇప్పుడు 2023 సంవత్సరం చివరి దశలో ‍‌(Goodbye 2023) ఉన్నాం, మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ‍‌(Happy new year 2024) అడుగుపెడతాం. 2024లో బ్యాంక్‌లకు నెలన్నర పాటు (46 రోజులు) సెలవులు వచ్చాయి. రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం కాకుండా ఈ 46 సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించింది. ఈ హాలిడేస్‌ అన్నీ వివిధ పండుగలు, జాతీయ సందర్భాలకు అనుగుణంగా వివిధ నెలల్లో ఉన్నాయి.  

బ్యాంక్‌లకు జనవరి నెలలోనే 12 సెలవులు (రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం కాకుండా) ఉన్నాయి. సెప్టెంబర్‌లో 7 రోజులు, అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో 5 రోజులు హాలిడేస్‌ వచ్చాయి. మార్చి, ఏప్రిల్‌, జులై, ఆగస్ట్‌ నెలల్లో 3 రోజులు చొప్పున, ఫిబ్రవరి, జూన్‌ నెలల్లో 2 రోజుల చొప్పున బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయి. మే, డిసెంబర్‌ నెలల్లో కేవలం ఒక్కరోజు హాలిడే ఉంది.  

ప్రస్తుతం, బ్యాంక్‌తో సంబంధం లేకుండా ఏ ఒక్క డబ్బు పని పూర్తి కావడం లేదు. సెలవు రోజుల గురించి ముందే తెలుసుకుంటే, దానిని బట్టి మీ పనిని ప్లాన్ చేసుకోవచ్చు.

2024లో బ్యాంకు సెలవుల జాబితా:

జనవరి 1, 2024- దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత
జనవరి 11, 2024- మిజోరంలో మిషనరీ డే కారణంగా సెలవు
జనవరి 12, 2024- స్వామి వివేకానంద జయంతి కారణంగా పశ్చిమ బెంగాల్‌లో సెలవు
జనవరి 13, 2024- లోహ్రీ & రెండో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు
జనవరి 14, 2024- మకర సంక్రాంతి & ఆదివారం కారణంగా సెలవు
జనవరి 15, 2024- పొంగల్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో సెలవు
జనవరి 16, 2024- తుసు పూజ కారణంగా పశ్చిమ బెంగాల్, అసోంలో సెలవు
జనవరి 17, 2024- గురుగోవింద్ సింగ్ జయంతి కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
జనవరి 23, 2024- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
జనవరి 25, 2024- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం కారణంగా ఆ రాష్ట్రంలో సెలవు
జనవరి 26, 2024- రిపబ్లిక్ డే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జనవరి 31, 2024- మీ-డ్యామ్-మీ-ఫీ కారణంగా అసోంలో సెలవు
ఫిబ్రవరి 15, 2024- లూ-నాయ్‌-ని కారణంగా మణిపూర్‌లో సెలవు
ఫిబ్రవరి 19, 2024- శివాజీ జయంతి కారణంగా మహారాష్ట్రలో సెలవు
మార్చి 8, 2024- మహాశివరాత్రి కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
మార్చి 25, 2024- హోలీ కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
మార్చి 29, 2024- గుడ్ ఫ్రైడే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 9, 2024- ఉగాది/గుడి పడ్వా కారణంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో సెలవు
ఏప్రిల్ 10, 2024- ఈద్-ఉల్-ఫితర్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 17, 2024- శ్రీ రామ నవమి కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 1, 2024- కార్మిక దినోత్సవం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు
జూన్ 10, 2024- శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం కారణంగా పంజాబ్‌ సెలవు
జూన్ 15, 2024- YMA డే కారణంగా మిజోరంలో  సెలవు
జూలై 6, 2024- MHIP డే కారణంగా మిజోరంలో  సెలవు
జూలై 17, 2024- మొహర్రం కారణంగా బ్యాంకులకు సెలవు
జూలై 31, 2024- షహీద్ ఉధమ్ సింగ్ బలిదానం దినం, హర్యానా & పంజాబ్‌లో సెలవు
ఆగస్టు 15, 2024- స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు
ఆగస్టు 19, 2024- రక్షాబంధన్ కారణంగా సెలవు
ఆగస్టు 26, 2024- శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
సెప్టెంబర్ 7, 2024- వినాయక చవితి కారణంగా సెలవు
సెప్టెంబర్ 13, 2024- రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి, రాజస్థాన్‌లో సెలవు
సెప్టెంబర్ 16, 2024- ఈద్-ఎ-మిలాద్ కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
సెప్టెంబర్ 17, 2024- ఇంద్ర జాత్ర కారణంగా సిక్కింలో సెలవు
సెప్టెంబర్ 18, 2024- నారాయణ గురు జయంతి కారణంగా కేరళలో సెలవు
సెప్టెంబర్ 21, 2024- నారాయణ గురు సమాధి కారణంగా కేరళలో సెలవు
సెప్టెంబర్ 23, 2024- అమరవీరుల దినోత్సవం కారణంగా హర్యానాలో సెలవు
అక్టోబర్ 2, 2024- గాంధీ జయంతి కారణంగా దేశవ్యాప్తంగా సెలవు
అక్టోబర్ 10, 2024- మహా సప్తమి కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
అక్టోబర్ 11, 2024- మహా అష్టమి కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
అక్టోబర్ 12, 2024- దసరా కారణంగా దేశవ్యాప్తంగా సెలవు
అక్టోబర్ 31, 2024- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కారణంగా గుజరాత్‌లో సెలవు
నవంబర్ 1, 2024- కుట్, హర్యానా డే, కర్ణాటక రాజ్యోత్సవ్ సెలవు
నవంబర్ 2, 2024- నింగోల్ చకౌబా మణిపూర్‌లో సెలవు
నవంబర్ 7, 2024- ఛత్ పూజ కారణంగా బీహార్, జార్ఖండ్‌లో సెలవు
నవంబర్ 15, 2024- గురు నానక్ జయంతి కారణంగా సెలవు
నవంబర్ 18, 2024- కర్ణాటకలో కనక్ దాస్ జయంతి సెలవు
డిసెంబర్ 25, 2024- క్రిస్మస్ కారణంగా సెలవు 

మరో ఆసక్తికర కథనం: సంచలనం సృష్టించిన టాప్‌-10 IPOలు, పెట్టుబడిదార్లకు కనక వర్షం

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *