PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

2024 కియా సోనెట్‌ను లాంచ్ చేసిన కంపెనీ – ఏం మార్పులు జరిగాయి? డిజైన్ పరంగా అదుర్స్!

[ad_1]

2024 New Kia Sonet Facelift Unveiled: దక్షిణ కొరియా కార్ల తయారీదారు సంస్థ కియా చాలా కాలం నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు దేశంలో తన 5 సీటర్ కారును ప్రవేశపెట్టింది. కంపెనీ 2020 సంవత్సరంలో కియా సోనెట్‌ను మొదటిసారి లాంచ్ చేసింది. ఆ తర్వాత చేసిన మొదటి అప్‌డేట్ ఇదే. ఈ కారు హ్యుందాయ్ వెన్యూతో పోటీపడుతుంది. కంపెనీ 2023 డిసెంబర్ 20వ తేదీ నుంచి కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌ను ప్రారంభిస్తుంది.

కొత్త సోనెట్ హెచ్‌టీకే, హెచ్‌టీకే ప్లస్, హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ ప్లస్, జీటీకే ప్లస్, ఎక్స్ లైన్, హెచ్‌టీఈ అనే ఏడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే… గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, క్లియర్ వైట్, ప్యూటర్ ఆలివ్, మ్యాట్ గ్రాఫైట్ షేడ్ మోనోటోన్ షేడ్స్‌లో ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్‌లో బ్లాక్ రూఫ్‌తో ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్ ఆప్షన్లు ఉన్నాయి.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
2024 సోనెట్ ఫీచర్ల గురించి మాట్లాడితే ఇది ఇన్వర్టెడ్ ఎల్ ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో అప్‌డేట్ ఫ్రంట్ ఫేసియా, రీడిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, వెనుకవైపు లైట్ బార్‌ను కలిగి ఉంది. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే కేబిన్‌లో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెవల్ 1 ADAS సూట్, కొత్త ఎయిర్‌కాన్ ప్యానెల్స్, వాయిస్ కంట్రోల్డ్ విండో ఫంక్షన్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ ఎలా ఉంది?
కొత్త కియా సోనెట్ ఇంజిన్ ప్రీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఇది 82 బీహెచ్‌పీ పవర్, 115 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగల 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 114 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 118 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇక ట్రాన్స్‌మిషన్ గురించి చెప్పాలంటే 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఐఎంటీ, 6 స్పీడ్ ఆటోమేటిక్, 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

కొత్త కియా ఇప్పుడు గతంలో కంటే సురక్షితంగా ఉంది. ఏడీఏఎస్ లెవెల్ 1 ఇందులో అందుబాటులో ఉంది. మీరు హ్యుందాయ్ వెన్యూలో కూడా ఇదే ఫీచర్‌ను చూడవచ్చు. ఏడీఏఎస్ ప్యాక్‌లో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, కొలిషన్ అవాయిడెన్స్ అసిస్టెన్స్, హై-బీమ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే కియా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత?
కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధరలను కియా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ధరలు వచ్చే ఏడాది జనవరిలో వెల్లడి కానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే – కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే – బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ – ఈవీ కూడా!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *