5జీ నుంచి డిజీ రూపీ వరకు – టెక్నాలజీ పెరిగిపోయింది భయ్యా!

[ad_1]

భారత్ ఈ ఏడాది డిజిటల్ రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించింది. డిజిటల్ ప్రయాణంలో 2022 అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఫాక్స్‌ కాన్, వేదాంత లాంటి  సంస్థల నుంచి పెద్ద పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా   ‘మేక్ ఇన్ ఇండియా’ దిశగా కీలక అడుగులు పడ్డాయి. యాపిల్ అధికారిక గ్లోబల్ లాంచ్ అయిన కొద్దిసేపటికే భారత్ లో  ఐఫోన్ 14 సిరీస్ తయారీ ప్రక్రియను ప్రారంభించింది. టెలికాం ఆపరేటర్లు 5G నెట్ వర్క్ ను దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నాయి.  డిజిటల్ చెల్లింపుల ఇంటర్‌ ఫేస్, అంటే UPI ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. RBI ఆమోదించిన లావాదేవీల కోసం డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతిక ప్రయాణంలో దేశం సాధించిన కీలక మైలురాళ్లను ఇప్పుడు చూద్దాం..   

5G నెట్ వర్క్  

News Reels

5G నెట్‌ వర్క్‌ ను ప్రారంభించడం టెక్నాలజీ పరంగా దేశం సాధించిన ముఖ్యమైన మైలు రాళ్లలో ఒకటి. ఈ ఏడాది అక్టోబర్‌ లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో ప్రధాని మోడీ 5Gని అధికారికంగా ప్రారంభించారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని వివిధ ప్రాంతాలలో తమ 5G నెట్‌ వర్క్‌ ను విస్తరిస్తున్నాయి.  దేశంలోని దాదాపు 60 నగరాల్లో 5G కనెక్టివిటీ అందుబాటులో ఉంది. వచ్చే రెండు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో 5G కవరేజీని అందించనున్నట్లు టెలికాం కంపెనీలు వెల్లడించాయి.   

డిజిటల్ రూపాయి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్‌లో డిజిటల్ రూపాయిని అధికారికంగా ప్రారంభించింది. ఇ-రూపాయి అనేది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC). దీన్ని RBI నిర్వహిస్తుంది. ఫియట్ కరెన్సీకి సమానమైన ట్రేడింగ్ విలువను కలిగి ఉంటుంది. దీనికి రూపాయి సపోర్టు ఉన్నందున,   Bitcoin, Dogecoin, Ethereum లాంటి  క్రిప్టోకరెన్సీల లాగా అస్థిరంగా ఉండదు. డిజిటల్ రూపాయి రెండు రకాలు – eRupee రిటైల్‌ ను అన్ని ప్రైవేట్ రంగం, ఆర్థికేతర వినియోగదారులు, వ్యాపారాలు ఉపయోగించుకోవచ్చు. దీని పైలట్ డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఆర్థిక సంస్థలు మాత్రమే ఉపయోగించుకునేలా eRupee హోల్‌సేల్ ను రూపొందించింది. దీని పైలట్ టెస్టింగ్ నవంబర్‌లో ప్రారంభమైంది.

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న UPI  

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) ప్రారంభించినప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి.  NPCI డేటా ప్రకారం, అక్టోబర్ 2022లో UPI ద్వారా  దేశంలో రూ. 12.11 ట్రిలియన్ల విలువైన 7.3 బిలియన్ లావాదేవీలు జరిగాయి.  UPI తన సేవలను నేపాల్, భూటాన్, UAE, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, UK సహా అనేక దేశాలలోఅందుబాటులోకి తెచ్చింది.

సెమీకండక్టర్, ఐఫోన్ తయారీ  

భారత ప్రభుత్వం 2020లో PLI, SPECS, EMC 2.0తో సహా పలు సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశంలో సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించింది.  అనేక టెక్ కంపెనీలు దేశంలో తమ  ఉత్పాదక సామర్థ్యాలను విస్తరించాయి. వేదాంత గ్రూప్ లాంటి స్థానిక తయారీ సంస్థలు తమ సామర్థ్యాలను మరింత అప్‌గ్రేడ్ చేయడానికి, విస్తరించడానికి ఈ పరిణామం ఉపయోగపడింది. ఈ ఏడాది ప్రారంభంలో వేదాంత గ్రూప్  దేశంలో సెమీకండక్టర్ల తయారీకి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు కోసం  తైవాన్‌కు చెందిన ఫాక్స్‌ కాన్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రెండు కంపెనీలు దేశంలో రెండు సంవత్సరాలలో డిస్ప్లే,  చిప్ ఉత్పత్తుల తయారీ కేంద్ర ఏర్పాటుకు  $19.5 బిలియన్ల పెట్టుబడి పెట్టాయి. జాయింట్ వెంచర్‌తో పాటు, ఫాక్స్‌కాన్ భారత్ లో ఐఫోన్ తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు $500 మిలియన్లను కూడా పెట్టుబడి పెట్టింది. దీంతో ఆపిల్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లలో దాని ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించాలని యోచిస్తోంది.  

సాంకేతిక చట్టాల అప్‌గ్రేడ్‌

టెక్నాలజీ రంగంలో వస్తున్న భారీ మార్పుల నేపథ్యంలో భారత ప్రభుత్వం  సాంకేతిక చట్టాలను అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది.  ఈ ఏడాది ప్రారంభంలోపార్లమెంటులో డేటా ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టింది. అన్ని సూచనలను దృష్టిలో ఉంచుకుని గత నెలలో బిల్లును మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ బిల్లు, విదేశాల్లోని కొన్ని దేశాలకు వినియోగదారుల వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. డేటా ఉల్లంఘనలకు సంబంధించిన సంఘటనలకు కంపెనీలపై ఆర్థిక జరిమానాలను కూడా ప్రతిపాదిస్తుంది.

Read Also: టూర్లు ఎక్కువ వేస్తున్నారా? అయితే ఈ టెక్నాలజీలు వాడండి!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *