5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ – టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!

[ad_1]

BSNL 5G Service: బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ టెక్నాలజీని 5-7 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ చేస్తామని టెలికాం, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా కంపెనీకి 1.35 లక్షల టెలికాం టవర్లు ఉన్నాయన్నారు. ప్రైవేట్లో ఎవరికీ ఇన్ని లేవన్నారు. టెలికాం సాంకేతిక అభివృద్ధి కోసం ఏడాదికి రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేశామన్నారు. విడతల వారీగా దానిని రూ.4000 కోట్లకు పెంచుతామని స్పష్టం చేశారు. సీఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొటక్‌ బ్యాంక్‌ సీఈవో ఉదయ్‌ కొటక్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌పై అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు బలమైన ఉనికి ఉందని వైష్ణవ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా 1,35,000 టవర్లు ఉన్నాయన్నారు. మరెవ్వరికీ ఇంత కవరేజీ లేదని స్పష్టం చేశారు. ‘టెలికాం టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం. ఐదు నుంచి ఏడు నెలల్లో 4జీ టెక్నాలజీని 5జీకి మారుస్తాం. మొత్తం 1.35 లక్షల టవర్ల పరిధిలో 5జీ సేవలు మొదలవుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ట్రయల్స్‌ నిర్వహణకు పరికరాలు అందించాలని టీసీఎస్‌ను అడిగిందన్నారు. 5జీ అప్‌గ్రేడేషన్‌ జరగ్గానే మిగతా ఇద్దరు పోటీదారులతో కలిసి మూడో బిగ్‌ ప్లేయర్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇండియన్‌ రైల్వే, డిఫెన్స్‌లో మాదిరిగానే టెలికాంలో అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ‘టెలికాంలోనూ మేమిదే మోడల్‌ను అనుసరిస్తాం. రూ.500 కోట్లతో టెలికాం అభివృద్ధి ఫండ్‌ను ఆరంభించాం. క్రమంగా దానిని ఏడాదికి రూ.3000-4000 కోట్లకు పెంచుతాం. మొత్తం ఇండస్ట్రీకి ఈ నిధి అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మోడల్‌తోనే రైల్వేలో 800 స్టార్టప్‌లు మొదలయ్యాయి. డిఫెన్స్‌లో 2000 స్టార్టప్‌లు భాగస్వాములు అయ్యాయి. సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాయి’ అని ఆయన వెల్లడించారు.

వందే భారత్‌ బోగీలను ఇండియన్‌ రైల్వే ఒక మిల్లీ మీటర్‌ మార్జిన్‌తో రూపొందించాయని అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీతో వీటిని తయారు చేశారన్నారు. 18 దేశాల్లోని వార్తా మాధ్యమాలు వీటి గురించి ప్రచురించాయని తెలిపారు. ‘ఒక మిల్లీ మీటర్‌ కన్నా తక్కువ మార్జిన్‌తో బోగీలు తయారు చేయాలన్న సవాల్‌ స్వీకరించాం. వీటిని 3తో చేసుకుంటే కచ్చితంగా జర్మనీకి ఎగుమతి చేసుండేవాళ్లం. వచ్చే ఏడాది ఇదే సమయానికి కనీసం 75-80 వందేభారత్‌ రైల్లు నడుస్తుంటాయి. అవి 2-3 ఏళ్లు తిరిగితే ప్రపంచ మార్కెట్‌ భారత్‌ పరం అవుతుంది. వందే భారత్‌ రైల్లు ఎక్కువ శబ్దం చేయకుండా, కనీసం షేక్‌ అవ్వకుండా 180 కిలో మీటర్ల వేగంతో నడుస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News Reels

Also Read: వర్కవుట్‌ అయిన పేటీఎం ప్లాన్‌, సర్రున పెరిగిన షేర్‌ ధర

Also Read: క్లైమాక్స్‌కు చేరుకున్న కేర్‌ హాస్పిటల్స్‌ మెగా సేల్‌, ₹8,000 కోట్లకు బ్లాక్‌స్టోన్‌ రెడీ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *