73000 దగ్గర సెన్సెక్స్ పోరాటం – దిగలాగుతున్న బ్యాంక్‌, ఐటీ స్టాక్స్‌

[ad_1]

Stock Market News Today in Telugu: గ్లోబల్‌ మార్కెట్లు డీలా పడడంతో భారత స్టాక్ మార్కెట్‌లో బలహీనత ధోరణి కొనసాగుతోంది. ఇండియన్‌ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 16 ఏప్రిల్‌ 2024) కూడా డౌన్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 73,000 స్థాయిని కోల్పోతే, నిఫ్టీ 22,150 దిగువన ఓపెన్‌ అయింది. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 450 పాయింట్లు పతనమైంది. బ్యాంక్‌, ఐటీ స్టాక్స్‌ కలిసి మార్కెట్‌ నష్టాలను లీడ్‌ చేస్తున్నాయి. అయితే.. 73,000 స్థాయిని నిలబెట్టుకోవడానికి సెన్సెక్స్‌ పోరాడుతోంది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…

గత సెషన్‌లో (సోమవారం) 73,399 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 507.64 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణతతో 72,892.14 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 22,272 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 147.20 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 22,125.30 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

విస్తృత మార్కెట్లు మాత్రం బలం ప్రదర్శించాయి. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.15 శాతం, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.6 శాతం పెరిగాయి.

ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 10 షేర్లు మాత్రమే గ్రీన్‌ జోన్‌లో ట్రేడవుతుండగా, మిగిలిన 20 స్టాక్స్ రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో… టాటా స్టీల్ తొలి స్థానంలో ఉంది. మారుతి సుజుకి, టైటన్, ఎం&ఎం, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మరోవైపు… ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.48 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.26 శాతం, ఇన్ఫోసిస్ 1.25 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.07 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.06 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.95 శాతం పడిపోయాయి.

నిఫ్టీ50 ప్యాక్‌లో 22 స్టాక్స్‌ లాభాల్లో ట్రేడవుతుండగా, 28 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌ లిస్ట్‌లో… ఒఎన్‌జీసీ 1.43 శాతం పెరిగింది. ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా షేర్లు కూడా లాభపడ్డాయి.

సెక్టార్ల వారీగా చూస్తే… నిఫ్టీ మీడియా, ఆటో ఇండెక్స్‌లు మాత్రమే కొద్దిగా లాభాల్లో ఉన్నాయి. మిగిలినవన్నీ నష్టాలను చవిచూశాయి. 

ఈ రోజు BSE లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (BSE M Cap) రూ.394.44 లక్షల కోట్లకు తగ్గింది, కొన్ని రోజుల క్రితం ఇది రూ.402 లక్షల కోట్ల రికార్డు స్థాయికి పెరిగింది. 

ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 366.97 పాయింట్లు లేదా 0.50% తగ్గి 73,032.81 దగ్గర; NSE నిఫ్టీ 97.40 పాయింట్లు లేదా 0.44% తగ్గి 22,175.10 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో.. ఈ ఉదయం, జపాన్‌కు చెందిన నికాయ్‌, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఆస్ట్రేలియాలోని ASX 200, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 1.4 శాతం చొప్పున ఆవిరయ్యాయి.

యుఎస్‌లో, నిన్న, బెంచ్‌మార్క్ సూచీల్లో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి, కనిష్ట స్థాయుల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.7 శాతం పడిపోయింది. నాస్‌డాక్ 1.8 శాతం పతనమైంది. S&P 500 1.2 శాతం కోల్పోయింది.

అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.6% దాటింది, 4.612 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ $91 సమీపంలో ట్రేడ్‌ అవుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు $2,400 దగ్గర ఉంది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *