80Cని మించి పన్ను ఆదా చేసే సెక్షన్లు – మీ ఇన్‌కమ్‌ను రూ.లక్షల్లో తగ్గించి చూపిస్తాయ్‌!

[ad_1]

Income Tax Return Filing 2024 – Tax Saving Tips: 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్‌లో, ఆదాయ పన్నుకు సంబంధించి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త, పాత పన్ను విధానాల్లోని టాక్స్‌ రిబేట్‌ పరిమితిని యథాతథంగా కొనసాగించారు. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో టాక్స్‌ రిబేట్‌ రూ. 7 లక్షలుగా ఉంది. ఇందులో వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు, తగ్గింపులు ఉండవు. జీతం తీసుకునే వ్యక్తులకు మాత్రం స్టాండర్డ్‌ డిడక్షన్‌ కింద మరో రూ.50,000 మినహాయింపు లభిస్తుంది. 

పాత ఆదాయ పన్నును ఫాలో అయితే డిడక్షన్స్‌, ఎగ్జంప్షన్స్‌ ఉంటాయి. ఈ పద్ధతిలో, ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద (Tax Saving under section 80C) రూ.1.5 లక్షల వరకు వార్షిక మినహాయింపును కేంద్రం అందిస్తోంది. ఇందులో కూడా, జీతం తీసుకునే వ్యక్తులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ కింద రూ.50,000 అదనపు మినహాయింపు ఉంటుంది. ఈ సెక్షన్‌ గురించి చాలా మందికి తెలుసు.

సెక్షన్ 80C కాకుండా, ఆదాయ పన్ను ఆదా కోసం మరికొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు ‍‌(Individual taxpayer) లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని తగ్గించి చూపి, పన్నును ఆదా చేయవచ్చు. 

ఆదాయ పన్ను ఆదా చేసే వివిధ సెక్షన్లు (Various Sections to Save Income Tax)

జాతీయ పింఛను పథకం ‍‌(National Pension System లేదా NPS)
మీరు NPS పథకం కింద పెట్టుబడి పెడితే, సెక్షన్ 80CCD (1B) కింద ‍(under subsection 80CCD (1B)), రూ. 50,000 వరకు ‍‌(టైర్‌-1 ఖాతా) పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్‌ 80C కింద లభించే రూ. 1.50 లక్షలకు ఇది అదనం. అంటే, సెక్షన్‌ 80C + సెక్షన్ 80CCD (1B) కలిపి రూ. 2 లక్షల ఆదాయ పన్నును క్లెయిమ్‌ చేయవచ్చు. మీపై పడే పన్ను భారాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80GGC (under section 80GGC of Income Tax Act) ప్రకారం, ఏదైనా రాజకీయ పార్టీ లేదా ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు ఇచ్చే విరాళం మొత్తాన్ని (100%) పన్ను చెల్లింపుదారు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. టాక్స్‌ పేయర్లు, పన్ను భారం తగ్గించుకోవడానికి + రాజకీయ పార్టీలపై అభిమానాన్ని చాటుకోవడానికి ఇలాంటి విరాళాలు (Political Donations) ఇస్తుంటారు. అయితే, ఒక పన్ను చెల్లింపుదారు ఇచ్చిన మొత్తం ఎన్నికల విరాళం, అతని మొత్తం ఆదాయం కంటే తక్కువగా ఉండాలన్నది నిబంధన.

స్వచ్ఛంద సేవ సంస్థలకు ఇచ్చే విరాళాలు
ఛారిటబుల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ లేదా స్వచ్ఛంద సేవ సంస్థలకు మీరు ఇచ్చే విరాళాలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఆదాయ పన్ను సెక్షన్ 80CCC కింద (under section 80CCC), స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన మొత్తాన్ని మినహాయింపుగా మీరు క్లెయిమ్ చేయవచ్చు. రూ. 200 కంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన విరాళాలపై ఈ సెక్షన్‌ కింద మినహాయింపు పొందొచ్చు.

ఆరోగ్య బీమా ప్రీమియం
ఆదాయపు పన్ను సెక్షన్ 80D కింద ‍(under subsection 80D), ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 25 వేల నుంచి రూ. 1 లక్ష ప్రీమియం వరకు దీనికి అవకాశం ఉంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పన్ను చెల్లింపుదార్లు రూ. 25,000 ప్రీమియం మీద పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. తల్లిదండ్రుల పేరు మీద మీరు కట్టే ప్రీమియంపైనా రూ. 25 వేల పన్ను మినహాయింపు పొందొచ్చు. 

పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీ
సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేసిన డబ్బుపై వచ్చిన వడ్డీపై, ఆదాయ పన్ను సెక్షన్ 80TTA కింద ‍(under subsection 80TTA) కింద, రూ. 10,000 వరకు టాక్స్‌ ఎగ్జంప్షన్‌ చూపించుకోచ్చు. అన్ని బ్యాంకుల్లోని పొదుపు ఖాతాలకు కలిపి ఈ సెక్షన్‌ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల విషయంలో.. 80TTB కింద రూ. 50,000 వార్షిక వడ్డీ ఆదాయం వరకు పన్ను ఉండదు.

గృహ రుణం వడ్డీపై పన్ను మినహాయింపు
మీరు ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, తిరిగి చెల్లించే అసలును సెక్షన్‌ 80C కింద క్లెయిమ్‌ చేసుకుంటారు. ఇది కాకుండా, అసలుపై తిరిగి చెల్లించే వడ్డీపై, ఆదాయ పన్ను చట్టంలోని 24(b) కింద (under section 24(b)), ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల వరకు టాక్స్‌ డిడక్షన్‌ పొందొచ్చు. ఆ ఇంటిని మీ సొంత ఉపయోగం కోసం వినియోగిస్తూ ఉండాలి.

మరో ఆసక్తికర కథనం: మళ్లీ ఆకాశంలోకి పసిడి పరుగు – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *