ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్‌

[ad_1]

ICICI Bank Loan Rates: ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి లోన్‌ తీసుకోవాలని ప్లాన్‌ చేసేవాళ్లకు గుడ్‌ న్యూస్‌. 2023 జూన్ నెల ప్రారంభమైన వెంటనే ఈ బ్యాంక్ తన MCLRను ‍‌(Marginal Cost of Funds based Lending Rate) మార్చింది. వ్యయాల ఆధారంగా నిర్ణయించే రుణ రేటు ఇది. ఐసీఐసీఐ బ్యాంక్‌ తాజా నిర్ణయంతో, రుణాలు చౌకగా మారాయి. ఇప్పుడు, బ్యాంక్‌ కస్టమర్లు హౌసింగ్‌ లోన్‌ సహా చాలా లోన్లను తక్కువ వడ్డీకే పొందవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్, ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ను (ICICI Bank MCLR) 8.35 శాతానికి కుదించింది. ఒక నెల కాల పరిమితి లోన్లపై MCLRను 8.50 శాతం నుంచి 8.35 శాతానికి, 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. మూడు నెలల కాలానికి MCLR 8.55 శాతం నుంచి 8.40 శాతానికి 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆరు నెలలు కాల వ్యవధి రుణాలపై MCLRను 8.75 శాతానికి, ఒక సంవత్సరం కాల వ్యవధి రుణాలపై MCLRను 8.85 శాతానికి కోత పెట్టింది. ఈ రేట్లన్నీ 2023 జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. 

రుణ కాల పరిమితి           MCLR
ఓవర్ నైట్ (ఒక రోజు)       8.35 శాతం
ఒక నెల                           8.35 శాతం
మూడు నెలలు                8.40 శాతం
ఆరు నెలలు                    8.75 శాతం
ఒక సంవత్సరం              8.85 శాతం

గృహ రుణం సహా చాలా లోన్లు ఇప్పుడు చౌక                
ICICI బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఫిబ్రవరి 8, 2023 నుంచి అమలులోకి వచ్చిన RBI పాలసీ రెపో రేటు 6.50 శాతం. అదే సమయంలో, ICICI బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR) 9.25 శాతం. MCLRను రివైజ్‌ చేస్తూ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయం తర్వాత, హౌసింగ్‌ లోన్స్‌ సహా అనేక రుణాలు ఇప్పుడు చౌకగా మారాయి. MCLR మార్గంలో హోమ్‌ లోన్లు తీసుకున్న కస్టమర్లు అదే మార్గాన్ని కొనసాగించడం ఉత్తమం. దీనివల్ల, ఎక్కువ కాలం పాటు తక్కువ EMI చెల్లించడానికి వీలవుతుంది.

వడ్డీ రేట్లపై RBI తీసుకొచ్చిన విధానాలు             
రిజర్వ్‌ బ్యాంక్‌, ఏప్రిల్ 1, 2016 నుంచి, వడ్డీ రేట్లను నిర్ణయించే బేస్ రేట్ సిస్టమ్‌ను MCLR సిస్టమ్‌కు మార్చింది. అదే సమయంలో, గృహ రుణాలు, వ్యాపార రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లు మొదలైన వాటి కోసం MCLR స్థానంలో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్కింగ్ లెండింగ్‌ రేట్‌ విధానాన్ని 01 అక్టోబర్ 2019 నుంచి అమలులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో ఉన్న రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. స్థిర వడ్డీ లోన్‌కు వర్తించదు.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *