ISRO: చంద్రయాన్-3.. 100 శాతం సక్సెస్ రేటున్న బాహుబలి రాకెట్‌ ద్వారా ప్రయోగం

[ad_1]

భారతీయ జానపద కథలలో చంద్రుడ్ని ‘చంద మామ’ అని పిలుస్తారు. ఇతర సంస్కృతుల్లో ఆర్టెమిస్ అనేది చంద్రుడిని స్త్రీ దేవతగా పాశ్చాత్యులు పూజిస్తారు. మిషన్ చంద్రయాన్ అనేది చంద్రుడిపై అన్వేషణకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ చేపట్టిన ప్రాజెక్ట్. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ 21వ శతాబ్దంలో చంద్రుడిపై అధ్యయనానికి అమెరికా చేసిన ప్రయత్నం. అయితే, ఆశ్చర్యకరంగా 2008లో భారత్ చేపట్టిన చంద్రయాన్-1 దాదాపు 50 సంవత్సరాల తర్వాత అమెరికాను మేల్కొలిపింది. ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌ను 2018లో నాసా చేపట్టడానికి ప్రేరణ ఇచ్చింది.

చంద్రుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చేపట్టిన చంద్రయాన్‌-3ను శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించనున్నారు. బాహుబలి రాకెట్‌గా గుర్తింపు పొందిన ఎల్‌వీఎం3-ఎం4. దీన్ని మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా ఇప్పటి వరకూ చంద్రుడిపై ఎవరూ వెళ్లని ప్రదేశంలో నిగూఢ రహస్యాలను ఇస్రో ఛేదించనుంది. నాలుగేళ్ల కిందట చంద్రయాన్‌-2 ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎదురైన వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. రెట్టించిన ఉత్సాహంతో తాజా ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటివరకూ అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. భారత్ కూడా తాజా ప్రయోగంతో ఆ దేశాల సరసన చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక, చంద్రయాన్-3 అనేది చంద్రుడిపై అధ్యయనానికి భారత్ చేపట్టిన మూడో మిషన్. 3,921 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్ ద్వారా దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎత్తునకు చేర్చనున్నారు. అప్‌గ్రేడ్ చేసిన ‘బాహుబలి రాకెట్’ను లాంచ్ వెహికల్ మార్క్ 3 (LM-3)గా పేరు మార్చారు. దీని బరువు 642 టన్నులు అంటే దాదాపు 130 ఆసియా ఏనుగుల బరువుకు సమానం. 43.5 మీటర్ల పొడవు ఉన్న భారీ రాకెట్.. కుతుబ్ మినార్ (72 మీటర్లు) ఎత్తులో సగం కంటే ఎక్కువ ఉంటుంది. 4,000 కిలోలపేలోడ్‌ను జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీఓ)లోకి ఇది మోసుకెళ్లగలదు.

దీనిలోని ఇంధనాన్ని దశలవారీగా మండించడం ద్వారా రాకెట్‌ను నింగిలోకి పంపిస్తారు. ఘన, ధ్రవ ఇంధన ఇంజిన్లు, స్ట్రాప్‌–ఆన్‌ బూస్టర్లు నిర్దేశిత సమయాల్లో పనిచేస్తాయి. ఎల్‌వీఎం–3లో విద్యుత్‌ సరఫరా కోసం రెండు వికాస్‌ ఇంజిన్లు ఉన్నాయి. ప్రాథమిక దశలో రెండు సాలిడ్‌ ప్రొపలెంట్‌ బూస్టర్లు అదనపు శక్తిని అందజేస్తాయి.

పేలోడ్‌ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడానికి అవసరమైన శక్తిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ సీఈ–20 సమకూరుస్తుంది. మొదట దశలో రెండు బూస్టర్లను ఒకేసారి మండించడ రాకెట్‌ టేకాఫ్‌ అవుతుంది. తర్వాత లిక్విడ్‌ కోర్‌ స్టేజ్‌ను 113 సెకండ్లపాటు, రెండు ఎస్‌200 బూస్టర్లను 134 సెకండ్లపాటు మండించనున్నారు. ప్రయోగం కేంద్రం నుంచి బయలుదేరిన 217 సెకన్ల తర్వాత భూమికి 115 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్‌తో కూడిన పేలోడ్‌ రాకెట్‌ నుంచి విడిపోతుంది.

రాకెట్‌కు అవసరమైన శక్తిని సమకూర్చడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇందులో రెండు సాలిడ్‌ స్ట్రాప్‌–ఆన్‌ మోటార్లు (ఎస్‌200), ఒక లిక్విడ్‌ కోర్‌ స్టేజ్‌(ఎల్‌110), 28 టన్నుల బరువైన ప్రొపలెంట్‌ లోడింగ్‌తో కూడిన ఒక హై–థ్రస్ట్‌ క్రయోజనిక్‌ అప్పర్‌ స్టేజ్‌(సీ25) ఉన్నాయి. ఈ రాకెట్‌ను మొదట ‘జీఎస్‌ఎల్‌వీ–ఎంకే3’గా వ్యవహరించేవారు. ఇస్రో దీనికి ఎల్‌వీఎం–3గా మార్చారు. దీని ద్వారా ఇప్పటివరకూ చేపట్టిన మూడు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. సక్సెస్ రేటు 100 శాతంగా ఉంది. చంద్రయాన్‌–3 నాలుగో ప్రయోగం కానుంది.

గతంలో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి ఎల్‌వీఎం–3 వాహక నౌకను ఉపయోగించారు. జీశాట్‌–19 కమ్యూనికేషన్‌ శాటిలైట్, అస్ట్రోశాట్‌ ఆస్ట్రానమీ శాటిలైట్, చంద్రయాన్‌–2లను ఇదే రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. భారతదేశంలో తొలి మానవ సహిత స్పేస్‌ క్రాఫ్ట్‌ ప్రయోగమైన గగన్‌యాన్‌ మిషన్‌లో ఎల్‌వీఎం–3 వాహక నౌక తన సేవలను అందించనుంది.

చంద్రయాన్ ప్రోగ్రామ్ చీఫ్ డాక్టర్ ఎం అన్నాదురై మాట్లాడుతూ.. చంద్రయాన్-2లో పరీక్షించని యంత్రాన్ని పంపామని, ల్యాండర్‌లో ఐదో ఇంజన్‌ను ఆలస్యంగా ప్రవేశపెట్టడమే వైఫల్యానికి కారణమని చెప్పారు. నావిగేషన్, అప్రోచ్ అటానమస్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లలో సాఫ్ట్‌వేర్ లోపాలు కూడా ఉన్నాయి అన్నారు. విక్రమ్ ల్యాండర్ కఠినమైన వాస్తవ అనుకరణల ద్వారా హాట్ టెస్టింగ్ చేయలేదని పేర్కొన్నారు. అయితే, ‘విక్రమ్ ల్యాండర్ మరింత పటిష్టంగా తయారైంది.. వైఫల్యానికి దారితీసే అనేక పారామీటర్స్2కు తగిన విధంగా పరిష్కరించడం వల్ల సాఫ్ట్ ల్యాండింగ్ కోసం నమ్మకంగా ఉన్నాం’ అని వివరించారు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *