‘చాట్‌జీపీటీ’కి పోటీగా మస్క్‌ మామ కొత్త కంపెనీ, పేరు xAI

[ad_1]

Elon Musk’s New Company xAI: ప్రపంచ కుబేరుడు & టెస్లా, ‍‌స్పేస్‌ఎక్స్‌ కంపెనీల CEO, ట్విట్టర్ ఓనర్‌ ఎలాన్‌ మస్క్‌ మరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రపంచ భవిష్యత్‌ను నిర్ణయిస్తున్న కృత్రిమ మేధ (Artificial Intelligence) రంగంలో కొత్త కంపెనీ స్టార్ట్‌ చేయబోతున్నట్లు మస్క్‌ మామ ప్రకటించారు.

‘ఓపెన్‌ఏఐ’ (OpenAI) తీసుకొచ్చిన చాట్‌బాట్‌ ‘చాట్‌జీపీటీ’ (ChatGPT) ప్రపంచ దేశాల్లో ఇప్పటికే సంచనాలు క్రియేట్‌ చేస్తోంది. గూగుల్‌ బార్డ్‌ (Bard) కూడా నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. మస్క్‌ మామ చూపు ఈ AIలపై పడింది. వీటికి పోటీగా కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీని లాంచ్‌ చేస్తున్నట్లు వరల్డ్‌ రిచెస్ట్‌ పర్సన్‌ ప్రకటించాడు. ఆ కంపెనీ పేరు ఎక్స్‌ఏఐ (xAI). ‘ఈ విశ్వం నిజమైన స్వభావాన్ని అన్వేషించడం & అర్ధం చేసుకోవడం’ (explore and understand the true nature of the universe) ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ లక్ష్యం.

రేపు ఫుల్‌ డిటైల్స్‌
రేపు (శుక్రవారం), ఎలాన్‌ మస్క్‌ & అతని టీమ్‌ లైవ్‌ ట్విట్టర్‌ స్పేసెస్‌లో (Live Twitter Spaces) అందుబాటులోకి వస్తారు, చాట్‌లో మరిన్ని వివరాలను అందిస్తారు.

వాస్తవానికి, చాట్‌జీపీటీని డెవలప్‌ చేస్తున్న దశలో ఎలాన్‌ మస్క్‌ అందులో పెట్టుబడులు పెట్టాడు, ఆ తర్వాత తప్పుకున్నాడు. మస్క్‌ తర్వాత, మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్‌ఏఐలో పెట్టుబడులు పెట్టింది.

మస్క్‌ టీమ్‌లో హేమాహేమీలు
డీప్‌మైండ్, ఓపెన్‌ఏఐ, గూగుల్ రీసెర్చ్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, టెస్లా వంటి ఫేమస్‌ గ్లోబల్‌ కంపెనీల్లో గతంలో పని చేసిన ఎక్స్‌పర్ట్‌లు xAI టీమ్‌లో ఉంటారు. డీప్‌మైండ్‌ ఆల్ఫాకోడ్, ఓపెన్‌AI GPT-3.5, GPT-4 చాట్‌బాట్‌లు సహా ముఖ్యమైన ప్రాజెక్టుల్లో వీళ్లు పని చేశారు. xAIతో ద్వారా.. చాట్‌జీపీటీ, బార్డ్, క్లాడ్ చాట్‌బాట్‌లను డెవలప్‌ చేసిన ఓపెన్‌ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్ వంటి ఎస్టాబ్లిష్‌డ్‌ ప్లేయర్స్‌తో పోటీ పడేందుకు మస్క్ బరిలోకి దిగాడు.

ఈ స్టార్టప్ గురించిన రిపోర్ట్స్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి బయటకు వచ్చాయి. ఒక లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ను డెవలప్‌ చేసేందుకు ఎన్‌విడియా (Nvidia) నుంచి వేలాది GPU ప్రాసెసర్లను మస్క్‌ కొన్నట్లు ఆ రిపోర్ట్స్‌ చెప్పాయి. అదే నెలలో, ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “ట్రూత్‌జీపీటీ” (TruthGPT) అనే AI టూల్‌ గురించి మస్క్‌ మాట్లాడాడు. చాట్‌జీపీటీ వంటి AIలు సొంత ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యహరించే రిస్క్‌ ఉందని, మానవాళికి అవి ముప్పుగా మారతాయని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పక్షపాతం చూపని AI కంపెనీని తాను స్టార్ట్‌ చేస్తానని చెప్పాడు.

‘సెంటర్ ఫర్ AI సేఫ్టీ’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాన్ హెండ్రిక్స్ xAIకి అడ్వైజర్‌గా పని చేస్తారు. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా సెంటర్ ఫర్ AI సేఫ్టీ పని చేస్తోంది, ఇది నాన్‌ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌. AI సృష్టించే రిస్క్‌లు పరిష్కరించాలంటూ ఇది చాలా కాలంగా చెప్పుకొస్తోంది. ఇప్పుడు, ఎలాన్‌ మస్క్‌ xAIకి ఈ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సర్వీస్‌ అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రిపోర్ట్స్‌ ప్రకారం, ఈ ఏడాది మార్చిలో, నెవాడాలో xAI మస్క్‌ మామ ప్రారంభించాడు. గతంలో, కొన్ని ఫైనాన్షియల్‌ ఫైలింగ్స్‌లో Twitter పేరును “X Corp”గా చెప్పాడు. xAI వెబ్‌సైట్ ప్రకారం, X Corpలో xAI భాగం కాదు. అయితే, X (Twitter), టెస్లా, ఇతర మస్క్‌ కంపెనీలతో కలిసి ఇది పని చేస్తుంది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *