ఈ యాక్టివిటీస్‌తో.. బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది..!

[ad_1]

Exercise for Brain: కంప్యూటర్‌ను CPU ఎలా నియంత్రిస్తుందో.. మన శరీరాన్ని మెదడు అలా కంట్రోల్‌ చేస్తుంది. ఇది ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటేనే మిగతా జీవక్రియలన్నీ సవ్యంగా జరుగుతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ మెదడు బలహీనపడటంతోపాటు జ్ఞాపకశక్తి కూడా మసకబారుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. చాలా మంది ఏవేవో మెడిసిన్స్‌ వాడుతూ ఉంటారు. అయితే.. మీ బ్రెయిన్‌ను షార్ప్‌ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెదడుకు యాక్టివిటీ ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, జ్ఞానశక్తి పెరుగుతాయి. ఈ అద్భుతమైన టిప్స్‌ డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా రక్షిస్తాయి. పనితీరును మెరుగుపరిచే.. చిట్కాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

మెడిటేషన్‌ చేయండి..

మనిషి భావోద్వేగాలు, భయాలు మెదడు కణాల పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల మెదడు పనితీరు నెమ్మదించడం, వాస్తవాలను అర్థం చేసుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, స్పందించడంలో కొంత వెనకబడుతుంది. మెడిటేషన్‌ చేయడం వల్ల ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ధ్యానం చేసేవాళ్లు ఏ విషయాన్నైనా తొందరగా గుర్తుకు తెచ్చుకోగలరు.. నేర్చుకోగలరు. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం, ధ్యానం మెదడు శక్తిని పెంచుతుంది.

విజువలైజ్‌ చేసుకోండి..

జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి, విజువలైజేషన్‌ సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు మార్కెట్‌కు వెళుతున్నట్లయితే, ఇంటి నుంచి బయలుదేరే ముందు, మీరు మార్కెట్లో ఉన్నారని, అవసరమైన వస్తువులను కొన్నారని ఊహించుకోండి. విజువలైజేషన్‌ మెదడుకు వ్యాయామంలా పని చేస్తుంది.

వ్యాయామం చేయండి..

వ్యాయామం శరీరానికి, ఆరోగ్యానికే కాదు.. మెదడుకూ మేలు చేస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. మెదడు చురుగ్గా ఉండటానికి కావాల్సిన పలు న్యూరోట్రాన్స్‌ మీటర్స్‌ వ్యాయామం చేయడం వల్ల విడుదలవుతాయి. అలాగే మెదడుకు తగినంత ఆక్సిజన్‌ రక్తం ద్వారా సరఫరా అవుతుంది. తద్వారా మెరుగైన ఆలోచనలు, సత్వర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

ఈ ఆటలు ఆడండి..

సుడోకు, క్రాస్‌వర్డ్‌ల వంటి ఆటలు మెదడుకు ఛాలెంజ్‌ చేస్తాయి. దీని కారణంగా మెదడు తన పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభిస్తుంది. మెదడుకు శ్రమ కల్పించాలి.. అప్పుడే సరిగ్గా పనిచేస్తుందని పెద్దలు, నిపుణులు అంటున్నారు. దీని వల్ల మెదడు పనితీరు క్రమంగా మెరుగవడం గమనించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సంగీతం వినండి..

ఉదయం లేవగానే చక్కటి సంగీతాన్ని వినడం అలవాటు చేసుకోండి. మెదడులో ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులున్నా సంగీతం మనిషి మానసిక స్థితిని మార్చేస్తుంది. సంగీతం వినే సమయంలో మెదడు డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒత్తడిని తగ్గిస్తుంది. ఒకే విషయంపై ఏకాగ్రత పెంచుకోవచ్చు. అల్జిమర్స్‌ వంటి మెదడు సంబంధిత వ్యాధులను సైతం సంగీతం కొంతమేర నయం చేస్తుందట.

కొత్త విషయాలు నేర్చుకోండి..

మనస్సు బలహీనపడటానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, మనం కొత్త విషయాలు నేర్చుకోవడం లేదా కొత్త వ్యక్తులను కలవడం మానేయడం. దీని కారణంగా మెదడు నేర్చుకునే విధానాన్ని మరచిపోవడం ప్రారంభిస్తుంది. అందుకే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *