[ad_1]
కొవ్వులో రకాలు..
సంతృప్త కొవ్వులు..
ఈ కొవ్వులు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. ఇవి ఎక్కువగా మాంసం, పాలు వంటి జంతు ఉత్పత్తులలో, కొబ్బరి నూనె, పామాయిల్ నూనెలో కనిపిస్తాయి. సంతృప్త కొవ్వులను మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తిన్నారు. ఇవి ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె సమస్యల ముప్పును పెంచుతుంది. (image source – pixabay)
Health Care: పేపర్ స్ట్రాలతో తాగుతున్నారా..?కళ్లు బైర్లు కమ్మే నిజాలు..!
మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్..
ఈ కొవ్వులు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటాయి. ఆలివ్ నూనె, అవకాడోలు, నట్స్‌లో ఇవి కనిపిస్తాయి. ఈ కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి హెల్తీ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. మన డేట్‌లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. (image source – pixabay)
పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్..
వీటిలో ఒమేగా -3, ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కూరగాయల నూనెలు, నట్స్‌లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. (image source – pixabay)
High Calcium Foods:పాలు తాగరా..? ఈ 5 కాల్షియం రిచ్ ఫుడ్స్ మీ కోసమే..!
ట్రాన్స్ ఫ్యాట్స్..
ఇవి హైడ్రోజనేషన్ అనే ప్రక్రియ ద్వారా కృత్రిమంగా ఏర్పడే కొవ్వులు. ఇవి కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫ్రైడ్ ఫుడ్స్‌లో కనిపిస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయని, గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటికి దూరంగా ఉండటమే మేలు అని సూచిస్తున్నారు. శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మన ఆహారంలో సంతృప్త, ట్రాన్స్‌ఫ్యాట్‌లను మితంగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. చాలా వరకు అసంతృప్త కొవ్వులను తీసుకోవాలని అంటున్నారు.
(image source – pixabay)
Health Care: పేపర్ స్ట్రాలతో తాగుతున్నారా..?కళ్లు బైర్లు కమ్మే నిజాలు..!
ఒక రోజులో ఎంత ఫ్యాట్ తీసుకోవచ్చు..
ఎంత కొవ్వు తీసుకోవాలనేది.. వ్యక్తిగత ఆహార అవసరాలుపై ఆధారపడి ఉంటుంది. మీ రోజువారి కేలరీ ఇన్‌టేక్‌లో 20-35 శాతం వరకు ఫ్యాట్స్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్‌ను తగ్గించి.. మోనో అన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఉదాహరణకు, మీరు 2,000 కేలరీల ఆహారం తీసుకుంటే, మీరు దాదాపు 40-55 గ్రాముల కొవ్వును తీసుకోవచ్చు. (image source – pixabay)
ఎక్కువగా తింటే.. ప్రమాదమే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఆహారంలో కొవ్వు ఎక్కువగా తీసుకుంటే.. ఊబకాయం, గుండె సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, అలాగే లివర్ సమస్యలపై ప్రభావం చూపే గట్ ఆరోగ్యం, జీవక్రియను కూడా ప్రభావితం అవుతుంది.
(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply