[ad_1]
Cost of Living: ‘వాటర్ ఈజ్ లైఫ్’… ఈ మాట మనమంతా చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రపంచ నాగరికత జల వనరులు ఉన్న ప్రాంతాల్లోనే ప్రారంభమైంది. నీరు మనిషికి ప్రాథమిక అవసరం. ఒకప్పుడు ప్రతి ఒక్కరికి మంచినీరు ఉచితం. ఇప్పుడు, నీటికి ధర నిర్ణయించే విధంగా పరిస్థితులు మారిపోయాయి. జీవించడానికి అవసరమైన ఈ ప్రాథమిక వస్తువును ఉచితంగా పొందలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నీటి కోసం డబ్బు చెల్లిస్తున్నారు, కొన్ని దేశాల్లో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
ప్రపంచంలోని ఏ దేశంలో డ్రింకింగ్ వాటర్ రేటు ఎక్కువ?
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో రీసెర్చ్ చేసిన numbeo.com అనే సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. జీవనానికి ఉపయోగపడే ఉత్పత్తుల ధర నిజ సమయ (రియల్ టైమ్) ధర గురించి సమాచారాన్ని అందించే వెబ్‌సైట్ అది. 100 దేశాల పేర్లతో numbeo.com రిలీజ్ చేసిన డేటా ప్రకారం, స్విట్జర్లాండ్‌లో మంచినీళ్లు చాలా కాస్ట్‌లీ. ఆ చలి దేశపు ప్రజలు తాగునీటి కోసం ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజల కంటే ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో, 330 మిల్లీలీటర్ల అతి చిన్న వాటర్ బాటిల్ రేటు 347.09 రూపాయలు.
భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
100 దేశాల జాబితాలో మన దేశం 95వ స్థానంలో ఉంది, ఇక్కడ 330 ml వాటర్ బాటిల్ ధర 16.01 రూపాయలు. ఈ లెక్కన భారతదేశంలో తాగునీరు చాలా చౌకగా లభిస్తోంది. 100 దేశాల జాబితాలో, మన దేశం కంటే దిగువన మరో 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. మన దేశం కంటే పైన 94 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల జనం డ్రింకింగ్ వాటర్ కోసం మన కంటే ఎక్కువ వ్యయం చేస్తున్నారు.
తాగునీరు అత్యంత ఖరీదైన టాప్-10 కంట్రీస్
1. స్విట్జర్లాండ్ గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక్కడ 330 ml తాగునీటి రేటు రూ. 347.09. దీని ప్రకారం ఒక లీటరు నీటి ధర రూ. 1000 కంటే ఎక్కువ అవుతుంది.
2. ఇతర దేశాల గురించి చూస్తే, యూరోపియన్ కంట్రీ లక్సెంబర్గ్‌లో 330 ml వాటర్ బాటిల్ రూ. 254.14కి లభిస్తుంది.
3. దీని తర్వాత డెన్మార్క్ పేరు వస్తుంది, ఇక్కడ 330 ml వాటర్ బాటిల్ రేటు రూ. 237.24.
4. జర్మనీలో 330 ml వాటర్ బాటిల్ 207.36 రూపాయలకు అందుబాటులో ఉంటుంది.
5. ఆస్ట్రియాలో 330 ml ఒక్కో బాటిల్ రూ. 205.80 రూపాయలకు లభిస్తుంది.
6. నార్వేలో రూ.205.60 రూపాయలు ఇస్తే 330 ml వాటర్ బాటిల్ చేతికి వస్తుంది.
7. బెల్జియంలో 330 ml వాటర్ కొనాలంటే పర్స్ నుంచి 199.24 రూపాయలు బయటకు తీయాలి.
8. నెదర్లాండ్స్‌లో 330 ml వాటర్ కావాలంటే 188.51 రూపాయలు వదులుకోవాలి.
9. ఆస్ట్రేలియాలో వాటర్ బాటిల్ 175.55 రూపాయలకు అందుబాటులో ఉంటుంది.
10. ఫ్రాన్స్‌లో 330 ml వాటర్ బాటిల్ 162.01 రూపాయలకు అందుబాటులో ఉంటుంది.
ప్రపంచంలోని వివిధ దేశాల్లోని రెస్టారెంట్లలో విక్రయించే వాటర్ బాటిల్ ధరలను ఆధారంగా తీసుకుని, ఆయా దేశాల్లో తాగునీటి కోసం ప్రజలు చేస్తున్న ఖర్చును numbeo.com లెక్కించింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply