ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ LIC, Granules, CAMS, Hero

[ad_1]

Stock Market Today, 04 December 2023: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఇది మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచే అవకాశం ఉంది. ఈ రోజు (సోమవారం) కనీసం 200-250 పాయింట్ల గ్యాప్‌-అప్‌తో మార్కెట్లు ప్రారంభమవుతాయని ఎక్స్‌పర్ట్స్‌ ఊహిస్తున్నారు. 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు నిఫ్టీని 22,000 స్థాయిలో చూసేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నారు.

గత ట్రేడింగ్‌ సెషన్‌ శుక్రవారం నాడు ఇండియన్‌ ఈక్విటీస్‌ లాభపడ్డాయి. ఊహించిన దానికంటే మెరుగైన GDP డేటా, గ్లోబల్ మార్కెట్లలో సానుకూల ధోరణితో నిఫ్టీ రికార్డు స్థాయికి చేరుకుంది.

US స్టాక్స్ అప్
ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు.. కీలక పాలసీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయనే అభిప్రాయానికి బలం చేకూర్చడంతో US స్టాక్స్‌ పుంజుకున్నాయి. శుక్రవారం సెషన్‌లో, S&P 500 సంవత్సరంలోనే హైయెస్ట్‌ రేంజ్‌లో ముగిసింది. డో జోన్ 0.82%, S&P 0.59%, నాస్‌డాక్ 0.55% లాభపడ్డాయి.

పెరిగిన ఆసియా షేర్లు
ఆసియా షేర్లు ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అయితే, కీలక ఆర్థిక డేటాలు వెలువడే ఈ వారంలో బంగారం మరొకమారు రికార్డు స్థాయిని తాకింది. వచ్చే ఏడాది నుంచి ప్రధాన సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న అంచనాలు సూచీల బలాన్ని పెంచుతున్నాయి.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 138 పాయింట్లు లేదా 0.67% గ్రీన్‌ కలర్‌లో 20,631 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌లో ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

LIC: ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ ఎల్‌ఐసీ, తన బోర్డులో వాటాదార్ల తరపు డైరెక్టర్లను చేర్చుకోవడానికి వీలుగా విధివిధానాలను సవరించింది. 

గ్రాన్యూల్స్‌: సిల్డెనాఫిల్ ఫర్ ఓరల్ సస్పెన్షన్ కోసం, ఈ కంపెనీ పూర్తి యాజమాన్యంలోని విదేశీ అనుబంధ సంస్థ అయిన గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ దాఖలు చేసిన కొత్త డ్రగ్ అప్లికేషన్‌కు US FDA నుంచి ఆమోదం లభించింది.

DHFL: ఈ కంపెనీ ఆడిటర్లపై నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్ NCLAT సమర్థించింది, అప్పీళ్లను కొట్టివేసింది. 

HUL: ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు కంపెనీకి స్వతంత్ర డైరెక్టర్‌గా మాజీ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్‌ను HUL నియమించింది.

హీరో మోటోకార్ప్: నవంబర్ నెలలో మొత్తం 4.91 లక్షల యూనిట్లను హీరో మోటోకార్ప్‌ అమ్మింది. ఇది సంవత్సరానికి 26% వృద్ధి. దేశీయ విక్రయాలు 25% పెరిగి 4.76 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.

గెయిల్: LNGని పంపిణీ చేయనందుకు, రష్యా ఇంధన దిగ్గజం గాజ్‌ప్రోమ్‌కు చెందిన గత సంస్థపై గెయిల్ ఇండియా కేసు వేసింది, నష్టపరిహారం కింద $1.817 బిలియన్లను కోరింది.

సైమెన్స్: సైమెన్స్ ఇండియాలో 18% వాటాను సైమెన్స్ ఎనర్జీ నుంచి దాదాపు రూ. 18,928 కోట్లకు సైమెన్స్ ఏజీ  కొనుగోలు చేస్తుంది. . ఇది ప్రమోటర్ల మధ్య జరిగే బదిలీ ఒప్పందం.

CAMS: నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ అయిన గ్రేట్ టెర్రైన్ ఇన్వెస్ట్‌మెంట్, క్యామ్స్‌లో వాటాను ఈ రోజు బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మే అవకాశం ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *