ఈ ఏడాది డబుల్‌ సెంచురీ కొట్టిన మల్టీబ్యాగర్లు, ‘అచ్చే దిన్‌’ చూసిన ఇన్వెస్టర్లు

[ad_1]

Top multibagger stocks in 2023: ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు ఇన్వెస్టర్లకు సిరులు కురిపించాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లలో స్తబ్దత ఉన్నా, ఆ తర్వాత బుల్‌ రన్‌ స్టార్టయింది. హైస్పీడ్‌ రన్‌లో చాలా మైలురాళ్లను ఇండెక్స్‌లు అధిగమించాయి.

2023లో, తొలి మూడు నెలలు మార్కెట్లలో తిరోగమన ధోరణి ఉంది. ఏప్రిల్‌ నుంచి జులై చివరి వరకు పెరుగుతూనే వెళ్లాయి. అక్కడి నుంచి అక్టోబర్‌ చివరి వరకు కన్సాలిడేషన్‌ జోన్‌లో ఉన్నాయి. నవంబర్‌ నుంచి విపరీతమైన వేగంతో రాకెట్లను తలపించాయి. ఓవరాల్‌గా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD), బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు (BSE & NSE) దాదాపు 17% లాభాలను సాధించాయి.

2023 బుల్ రన్‌లో దాదాపు 200 స్టాక్స్‌ మల్టీబ్యాగర్స్‌గా మారాయి, 1153% వరకు రిటర్న్స్‌ ఇచ్చాయి. 

ఈ ఏడాది స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ సూపర్‌ స్పీడ్‌లో ఉంది. దీనికి తగ్గట్లే, స్మాల్‌ క్యాప్‌ షేర్లు మొత్తం మార్కెట్‌ను ఆటాడించాయి, మల్టీబ్యాగర్స్‌లో (small cap multibagger stocks in 2023) సింహభాగాన్ని ఆక్రమించాయి. మొత్తం 200 మల్టీబ్యాగర్స్‌లో 190 వరకు స్మాల్‌ క్యాప్‌ సెగ్మెంట్‌లోనే ఉన్నాయి. వీటిలోనూ, 143 షేర్లు వాటి జీవిత కాల గరిష్టాలను తాకినట్లు ఏస్ ఈక్విటీ డేటాను బట్టి అర్ధం అవుతోంది.

స్మాల్‌ క్యాప్ మల్టీబ్యాగర్ల లిస్ట్‌లో “జై బాలాజీ ఇండస్ట్రీస్‌”ది టాప్‌ ప్లేస్‌. ఇది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 1153% పెరిగింది, గత వారం కూడా కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది.

మిడ్‌ క్యాప్ (mid cap multibagger stocks in 2023) స్పేస్‌లో 8 స్టాక్స్‌ మల్టీబ్యాగర్ బ్యాడ్జ్‌ గెలుచుకున్నాయి, వీటిలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ 8 కంపెనీల పేర్లు… REC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, SJVN, అరబిందో ఫార్మా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, ట్రెంట్, పాలిక్యాబ్ ఇండియా. వీటిలో హైయెస్ట్‌ రిటర్న్స్‌ ఇచ్చింది REC ‍(270%). మిడ్‌ క్యాప్‌ మల్టీబ్యాగర్స్‌లో…  REC, PFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్, SJVN, ట్రెంట్, పాలిక్యాబ్ ఇండియా షేర్లు గత వారం కొత్త లైఫ్‌ టైమ్‌ హైస్‌కు చేరాయి. 

లార్జ్‌ క్యాప్ (large cap multibagger stocks in 2023) స్పేస్‌లో మల్టీబ్యాగర్‌ హోదాకు చేరుకున్నవి కేవలం రెండు స్టాక్స్‌ మాత్రమే. అవి జొమాటో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (HAL). 2023లో ఇప్పటి వరకు ఇవి 118% వరకు రిటర్న్స్‌ ఇచ్చాయి. HAL కూడా గత వారం తాజా జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది.

2023 మల్టీబ్యాగర్స్‌లో ఉన్న ప్రముఖ స్టాక్స్‌, YTD రిటర్న్స్‌:

ఆరియన్‌ప్రో సొల్యూషన్స్ —– 478%
టిటాగర్ రైల్ సిస్టమ్స్  —– 376%
జిందాల్ సా  —– 321%
ఐనాక్స్ విండ్  —– 278%
REC  —– 270%
జూపిటర్ వాగన్స్‌  —– 266%
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్  —– 265%
ఆనంద్ రాఠీ వెల్త్‌  —– 265%
సుజ్లాన్ ఎనర్జీ  —– 264%
కేన్స్ టెక్నాలజీ ఇండియా  —– 244%

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: రూ.63 వేల దగ్గర తిష్టవేసిన గోల్డ్‌ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *