డిసెంబర్‌లో రికార్డ్‌, ఒక్క నెలలో 42 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్స్‌

[ad_1]

Demat Accounts Opening in December 2023: గత ఏడాది డిసెంబర్‌ నెలలో, కొత్త డీమ్యాట్ ఖాతాలు వరదలా ఓపెన్‌ అయ్యాయి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (CDSL), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (NSDL) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా కొత్త డీమ్యాట్ ఖాతాల్లో పాత రికార్డ్‌ బద్ధలైంది. 

డిసెంబర్‌ నెలలో ఓపెన్‌ చేసిన కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య 41.78 లక్షలకు పైగా ఉంది. అంతకుముందు, 2023 నవంబర్‌లో మొత్తం 27.81 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. 2022 డిసెంబర్‌లో, భారతదేశంలో, మొత్తం 21 లక్షలకు పైగా డీమ్యాట్ ఖాతాలు ఓపెన్‌ అయ్యాయి. అంటే, గతేడాదితో పోలిస్తే 2023 డిసెంబర్‌లో కొత్త డీమాట్‌ అకౌంట్లు రెట్టింపయ్యాయి.

డిసెంబర్‌లో ప్రారంభమైన 41.78 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలతో కలిపి, దేశవ్యాప్తంగా మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 13.93 కోట్లు దాటింది. ఈ ఖాతాల మొత్తం సంఖ్య ఒక నెలలో 3.1 శాతం, వార్షిక ప్రాతిపదికన 28.66 శాతం పెరిగింది.

డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఎందుకు పెరిగింది?         
2023 డిసెంబర్‌లో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌లో వెలువడ్డాయి, కేంద్రంలో అధికారంలో ఉన్న BJP మూడు చోట్ల పూర్తి మెజారిటీ సాధించింది.  ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా మోదీ ప్రభుత్వం కొనసాగాలన్న ఆశలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బలపరిచాయి. స్థిరమైన ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతంగా పెట్టుబడిదార్లు పరిగణిస్తారు. ఆ ప్రభావం డీమ్యాట్ ఖాతాల సంఖ్య, పెట్టుబడులపై కనిపించింది. 

ఇది కాకుండా, స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన ర్యాలీ, చాలా IPOల అద్భుతమైన లిస్టింగ్స్‌ కూడా పెట్టుబడిదార్లలో విశ్వాసాన్ని పెంచాయి. 2023 చివరి నాటికి, సెన్సెక్స్ & నిఫ్టీ రెండూ వార్షిక ప్రాతిపదికన 18.8 శాతం & 20 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BSE మిడ్‌ క్యాప్‌ & స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఏడాదిలో 45.5 శాతం & 47.5 శాతం చొప్పున పెరిగాయి. 

డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరగడంలో స్టాక్ మార్కెట్‌లో కనిపించిన బూమ్ పెద్ద పాత్రను పోషించింది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 7.6 శాతం వృద్ధిని సాధించింది. RBI అంచనాల కంటే ఇది ఎక్కువగా ఉంది. ఆ కాలంలో GDP 6.5 శాతంగా ఉండొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. ఆర్‌బీఐ అంచనాల కంటే మెరుగైన GDP గణాంకాలు కూడా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి.

20 కోట్లు దాటనున్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య          
మనీ కంట్రోల్‌ రిపోర్ట్‌ ప్రకారం.. స్టాక్ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడం వల్ల, వచ్చే 12 నెలల్లో దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 20 కోట్లు దాటుతుంది. అంటే ఈ ఏడాది కాలంలో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం, ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్‌లు సృష్టించే అవకాశం ఉంది. 

మరో ఆసక్తికర కథనం: వరుసగా ఏడో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ రిజర్వ్స్‌, రికార్డ్‌ స్థాయికి చేరువ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *