[ad_1]
Latest Interest Rates For Home Loans: ఇల్లు కట్టుకోవడం లేదా కొనడం కామన్‌మ్యాన్ చిరకాల స్వప్నం. చాలా కొద్ది మంది జీవితంలోనే ఈ కల సాకారం అవుతుంది. ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫీట్ సాధించే వ్యక్తులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలా ఎక్కువ మందికి తప్పనిసరిగా హోమ్ లోన్ అవసరమవుతుంది. చాలా మంది టాక్స్‌పేయర్లు, ఆదాయ పన్ను ఆదా చేసుకోవడం కోసం, అవసరం లేకుపోయినా హౌసింగ్ లోన్ తీసుకుంటారు.
ప్రస్తుతం, గృహ రుణాలు మీద బ్యాంక్‌లు వసూలు చేస్తున్న అత్యల్ప వడ్డీ రేటు 8.35%. దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్ (Credit score), నెలవారీ ఆదాయం (Monthly income), ఉద్యోగం చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా, ఖర్చులు పోను నెలకు ఎంత మిగులుతుంది, ఎంత లోన్ కావాలి (Loam amount), ఎంత కాలంలో తిరిగి చెల్లిస్తాడు (Loan tenure).. ఇలాంటి విషయాలపై ఆధారపడి హోమ్ లోన్ రేట్ మారుతుంది.
గృహ రుణాలపై 19 బ్యాంక్‌ల్లో వడ్డీ రేట్లు ఇవి (Latest interest rates for home loans) (ఆరోహణ క్రమంలో):
1) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) — కనిష్ట వడ్డీ రేటు 8.35% — గరిష్ట వడ్డీ రేటు 10.90%
2) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) — కనిష్ట వడ్డీ రేటు 8.35% — గరిష్ట వడ్డీ రేటు 11.15%
3) HDFC బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.35% — గరిష్ట పరిమితి లేదు
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) — కనిష్ట వడ్డీ రేటు 8.40% — గరిష్ట వడ్డీ రేటు 10.05%
5) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) — కనిష్ట వడ్డీ రేటు 8.40% — గరిష్ట వడ్డీ రేటు 10.15%
6) కెనరా బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.40% — గరిష్ట వడ్డీ రేటు 11.15%
7) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) — కనిష్ట వడ్డీ రేటు 8.40% — గరిష్ట పరిమితి లేదు
8) HSBC బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు — గరిష్ట వడ్డీ రేటు 8.45%
9) కర్ణాటక బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.58% — గరిష్ట వడ్డీ రేటు 10.58%
10) కోటక్ మహీంద్ర బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.70% — గరిష్ట పరిమితి లేదు
10) యాక్సిస్ బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.70% — గరిష్ట వడ్డీ రేటు 9.10%
12) ICICI బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.75% — గరిష్ట పరిమితి లేదు
13) ఫెడరల్ బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.80% — గరిష్ట పరిమితి లేదు
14) RBL బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.90% — గరిష్ట పరిమితి లేదు
15) కరూర్ వైశ్యా బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 8.95% — గరిష్ట వడ్డీ రేటు 11%
16) బంధన్ బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 9.16% — గరిష్ట వడ్డీ రేటు 13.33%
17) సౌత్ ఇండియన్ బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 9.84% — గరిష్ట వడ్డీ రేటు 11.69%
18) CSB బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 10.69% — గరిష్ట వడ్డీ రేటు 12.54%
19) సిటీ యూనియన్ బ్యాంక్ — కనిష్ట వడ్డీ రేటు 13.35% — గరిష్ట వడ్డీ రేటు 14.85%
మరో ఆసక్తికర కథనం: మీకు అంత జీతం అవసరమా? లావైపోతారు, తిరిగి ఇచ్చేయండి
[ad_2]
Source link
Leave a Reply