ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Paytm, Tatas, Airtel, Vedanta

[ad_1]

Stock Market Today, 01 March 2024: గురువారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ప్రకటించిన కీలకమైన స్థూల ఆర్థిక డేటాకు ఈ రోజు (శుక్రవారం) ఈక్విటీ మార్కెట్లు ప్రతిస్పందిస్తాయి. భారతదేశ Q3 GDP ఊహించిన దాని కంటే మెరుగ్గా, 8.4 శాతం వృద్ధి నమోదైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), FY24 వృద్ధి అంచనాను జనవరిలోని అంచనా 7.3 శాతం నుంచి 7.6 శాతానికి పెంచింది. ఇది కీలకమైన పాజిటివ్‌ ట్రిగ్గర్‌.

భారతదేశ ప్రధాన రంగ ఉత్పత్తి (core sector output) జనవరిలో 3.6 శాతం పెరిగింది. దేశంలోని 8 కీలక పరిశ్రమల ద్వారా దీనిని అంచనా వేస్తారు. 

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 42 పాయింట్లు లేదా 0.19 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,197 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం, ఆసియా మార్కెట్లలో జపాన్‌ నికాయ్‌ 1.3 శాతం పెరిగింది. మిగిలిన మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్ చేస్తున్నాయి.
 
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభం కావొచ్చన్న అభిప్రాయాలు ద్రవ్యోల్బణం డేటా తర్వాత బలపడడంతో, నిన్న US మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. S&P 500, నాస్‌డాక్ తాజా రికార్డు గరిష్టాలను తాకాయి. ఒక దశాబ్దంలోనే అత్యధికంగా, ఫిబ్రవరిలో ఎక్కువ లాభాలతో క్లోజ్‌ అయ్యాయి. గురువారం నాస్‌డాక్ 0.9 శాతం, S&P 500 0.5 శాతం, డో జోన్స్‌ 0.1 శాతం పెరిగాయి. 

10-సంవత్సరాల US ట్రెజరీ బాండ్ ఈల్డ్ 4.264 శాతానికి తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు సుమారు $82 వద్ద తిష్టవేసింది. బిట్‌కాయిన్ వరుసగా రెండో రోజు కూడా 60,000 డాలర్ల మార్క్‌పైనే ఉంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఆటో స్టాక్స్: ఫిబ్రవరిలో జరిగిన వాహనాల అమ్మకాలు వెల్లడవుతాయి కాబట్టి, ఆటో కంపెనీల షేర్లు మార్కెట్‌ రాడార్‌లో ఉంటాయి.

Paytm: మర్చంట్‌ ఖాతాలను యెస్ బ్యాంక్‌కు తరలించేందుకు పేటీఎం ఒప్పందం కుదుర్చుకుందని NDTV ప్రాఫిట్ రిపోర్ట్‌ చేసింది. యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌ పని చేసేందుకు NPCI నుంచి థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లైసెన్స్ కోసం పేటీఎం దరఖాస్తు చేసింది.

L&T: గుజరాత్‌లోని హజీరాలోని గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌లో మొదటి హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌ను ప్రారంభించింది.

టాటా గ్రూప్ స్టాక్స్: గుజరాత్‌లోని ధోలేరాలో, దేశంలోని మొట్టమొదటి పెద్ద చిప్ ఫాబ్రికేషన్ ఫ్లాంట్‌ను నిర్మించాలనే టాటా గ్రూప్ ప్రతిపాదనతో సహా, మూడు సెమీకండక్టర్ ప్లాంట్లలో రూ. 1.26 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు, అస్సాంలో చిప్ అసెంబ్లీ ప్లాంట్ కోసం టాటాల ప్రత్యేక ప్రతిపాదనను, గుజరాత్‌లోని సనంద్‌లో CG పవర్ ద్వారా మరొక ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మూడు ప్రాజెక్టుల పనులు మరో 100 రోజుల్లో ప్రారంభం అవుతాయి.

CG పవర్: Renesas Electronics Corp భాగస్వామ్యంతో, గుజరాత్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ స్థాపన కోసం ఈ కంపెనీ రూ.7,600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

భారతి ఎయిర్‌టెల్: FY25 చివరి నాటికి రూ.300 ARPU సాధించాలని సునీల్ మిత్తల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 5G కోసం వినియోగదార్లు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

వేదాంత: తీవ్రమైన ఉల్లంఘనలు, పదేపదే ఉల్లంఘనల కారణంగా, తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న రాగి స్మెల్టర్ ప్లాంట్‌ను తిరిగి తెరవాలన్న వేదాంత గ్రూప్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *