[ad_1]
Stock Market News Today in Telugu: భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు (బుధవారం, 03 ఏప్రిల్ 2024) మిశ్రమ సంకేతాలతో ట్రేడవుతోంది. ప్రి-ఓపెనింగ్‌లో గ్రీన్ మార్క్‌తో ట్రేడయిన మార్కెట్, బిజినెస్ ప్రారంభమైన వెంటనే పతనావస్థలోకి జారుకుంది. సరైన డైరెక్షన్ కోసం సెన్సెక్స్, నిఫ్టీ ఎదురు చూస్తున్నాయి. ఈ రోజు మెటల్ స్టాక్స్‌లో మంచి వృద్ధి కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో మెటల్ స్టాక్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (మంగళవారం) 74,255 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 146.68 పాయింట్లు లేదా 0.20 శాతం క్షీణతతో 73,757.23 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. మంగళవారం 22,453 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 67.60 పాయింట్లు లేదా 0.30 శాతం తగ్గి 22,385.70 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో కాస్త పాజిటివ్‌నెస్ కనిపించింది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి.
ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 21 షేర్లు గ్రీన్ జోన్‌లో ట్రేడవుతుండగా, 9 స్టాక్స్ రెడ్ జోన్‌లో చిక్కుకున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. టెక్ మహీంద్ర 1.48 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.39 శాతం లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ 1.10 శాతం, టాటా స్టీల్ 0.52 శాతం పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ 0.31 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.18 శాతం బలం పుంజుకున్నాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో 12 షేర్లు మాత్రమే లాభపడగా, 38 స్టాక్స్ పతనావస్థలో కనిపించాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో… హిందాల్కో 1.79 శాతం, శ్రీరామ్ ఫైనాన్స్ 1.54 శాతం లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 1.33 శాతం, ఓఎన్‌జీసీ 1.10 శాతం పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ 1 శాతం వృద్ధితో ట్రేడవుతోంది.
బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు బాగా చల్లబడింది. ఈ ఇండెక్స్ 277.80 పాయింట్లు, దాదాపు అర శాతం పడిపోయి 47,317 స్థాయి వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీలోని 12 షేర్లలో 11 క్షీణతలో ఉండగా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే పచ్చదనం పులుముకున్నాయి.
ప్రి-ఓపెనింగ్ సెషన్
ప్రీ-ఓపెనింగ్ సెషన్‌లో BSE సెన్సెక్స్ 163.92 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 74067 స్థాయి వద్ద ట్రేడయింది. NSE నిఫ్టీ 101 పాయింట్లు లేదా 0.45 శాతం పెరుగుదలతో 22,554 స్థాయి వద్ద ఉంది.
ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 10.79 పాయింట్లు లేదా 0.01% తగ్గి 73,893.12 దగ్గర; NSE నిఫ్టీ 3.00 పాయింట్లు లేదా 0.02% తగ్గి 22,450.30 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో.. ఈ ఉదయం కోస్పి 1.4 శాతం పతనమైంది. నికాయ్, ASX200 1 శాతం చొప్పున పడిపోయాయి. హాంగ్ సెంగ్ 0.3 శాతం క్షీణించింది.
నిన్న, అమెరికాలో, డౌ జోన్స్ దాదాపు 400 పాయింట్లు లేదా 1 శాతం కోల్పోయింది. S&P 500 0.72 శాతం తగ్గింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.95 శాతం నష్టపోయింది.
అమెరికాలో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ పుంజుకుంది, 4.349 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $89 టచ్ చేశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply