[ad_1]
Multibagger Stocks: స్టాక్ మార్కెట్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. మనం ఎన్నో లెక్కలు వేసి, ఎంతో తెలివిగా ఆలోచించి కొనే స్టాక్స్ కూడా ఒక్కోసారి విఫలమవుతాయి, మన పెట్టుబడిని ఆవిరి చేస్తాయి. అయితే, ఆ కౌంటర్లలో బలం తగ్గడానికి కారణాలేంటో ఆలోచించాలి. ఆయా కంపెనీల వ్యాపార నాణ్యత, విధానాల్లో లోపం లేదని మీరు భావిస్తే నిస్సందేహంగా ఆ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కొనసాగించవచ్చు. నమ్మకం కుదరకపోతే వెంటనే అమ్మేయడం ఉత్తమం.
ఇదే కోవలో, కొన్ని టాప్ మల్టీబ్యాగర్ బెట్స్ గత సంవత్సర కాలంలో విఫలమయ్యాయి. అయితే, గత 5 సంవత్సరాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇవి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. వీటిలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతానికి మాత్రం పైమెట్టు ఎక్కడానికి కష్టపడుతున్నాయి. ఆ స్టాక్స్ – లారస్ ల్యాబ్స్, టాటా పవర్, బ్రైట్‌కామ్ గ్రూప్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, మాస్టెక్.
లారస్ ల్యాబ్స్ (Laurus Labs)
గత ఏడాది కాల రిటర్న్స్: −37%
గత ఐదేళ్ల కాల రిటర్న్స్: 233%
గత ఐదేళ్లలో పెరిగిన పబ్లిక్ షేర్ హోల్డింగ్: 21%
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఎంత పడింది: 47%
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ స్టాక్ మీద ‘బయ్’ రేటింగ్ కంటిన్యూ చేస్తూ, రూ. 355 టార్గెట్ ధర ఇచ్చింది.
టాటా పవర్ (Tata Power)
గత ఏడాది కాల రిటర్న్స్: −7%
గత ఐదేళ్ల కాల రిటర్న్స్: 143%
గత ఐదేళ్లలో పెరిగిన పబ్లిక్ షేర్ హోల్డింగ్: 14%
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఎంత పడింది: 30%
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ స్టాక్ మీద ‘బయ్’ రేటింగ్ కంటిన్యూ చేస్తూ, రూ. 262 టార్గెట్ ధర ఇచ్చింది.
బ్రైట్‌కామ్ (Brightcom)
గత ఏడాది కాల రిటర్న్స్: −37%
గత ఐదేళ్ల కాల రిటర్న్స్: 233%
గత ఐదేళ్లలో పెరిగిన పబ్లిక్ షేర్ హోల్డింగ్: 13%
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఎంత పడింది: 77%
బ్రైట్‌కామ్ స్టాక్‌ను ఏ ఎనలిస్టూ కవర్ చేయడం లేదు.
ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (Indian Energy Exchange – IEX)
గత ఏడాది కాల రిటర్న్స్: −36%
గత ఐదేళ్ల కాల రిటర్న్స్: 164%
గత ఐదేళ్లలో పెరిగిన పబ్లిక్ షేర్ హోల్డింగ్: 12%
52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఎంత పడింది: 50%
11 మంది ఎనలిస్ట్‌లు ఈ స్టాక్‌కు ‘సెల్’ రేటింగ్ ఇచ్చారు.
మాస్టెక్ (Mastek)
గత ఏడాది కాల రిటర్న్స్: −37%
గత ఐదేళ్ల కాల రిటర్న్స్: 241%
గత ఐదేళ్లలో పెరిగిన పబ్లిక్ షేర్ హోల్డింగ్: 11%
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ స్టాక్ రేటింగ్‌ను ‘హోల్డ్’ నుంచి ‘రెడ్యూస్’కు తగ్గించింది. షేర్‌ఖాన్ ‘హోల్డ్’ రేటింగ్ కంటిన్యూ చేస్తూ రూ. 1,900 టార్గెట్ ధర ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply