[ad_1]
కాఫీతో లాభాలు..
కాఫీ.. ఇందులోని కెఫిన్‌పై ఎన్నో పరిశోధనలు సాగాయి. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతారు. జీవక్రియను వేగంగా చేయడంలో ఈ కాఫీ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కొవ్వుని కరిగించడానికి కూడా ఇది బాగా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
సన్నని నడుము..
సన్నని నడుము అంటే ఎవరికైనా ఆశే. నడుము ఉందా లేదన్నట్లుగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా ఆడవారు. కాఫీలోని గొప్ప గుణాలు నడుము దగ్గర కొవ్వుని తగ్గించి త్వరగా బరువు తగ్గేలా చూస్తాయి. మరి అలాంటి కాఫీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
Also Read : Cardio Workouts : ఈ ఎక్సర్‌సైజ్ చేస్తే బరువు తగ్గడంతో పాటు గుండెకి చాలా మంచిదట..
దాల్చిన అల్లం కాఫీ..
దాల్చిన, అల్లం రెండు కూడా బరువు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. మరి ఈ రెండింటి కలయికలో మాంచి కాఫీ తాగితే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ కాఫీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం..
ఎస్ప్రెస్సో షాట్ 40 మి.లీ
దాల్చిన చెక్క పొడి పావు టీస్పూన్
జాజికాయ పొడి పావు టీ స్పూన్
వెనీలా ఎక్స్ట్రాక్ట్ పావు టీ స్పూన్
తేనె 1 టీ స్పూన్
లో ఫ్యాట్ పాలు 120 మి.లీ(ఇందులో చాలా పదార్థాలు సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. మీరు ట్రై చేయొచ్చు)
తయారీ విధానం..
ముందుగా ఓ కప్పులో కాఫీ పొడి అల్లం పొడిని వేయండి
మిగతా పదార్థాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయండి
తర్వాత ఎస్ప్రెస్సో షాట్ వేసి బాగా కలపండి
ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వేసి బాగా కలపండి
చివరగా, జాజికాయ, దాల్చిన చెక్క పొడి వేసి గార్నిష్ చేసుకోండి.
స్పైస్డ్ మోచా..
కావాల్సిన పదార్థాలు..
ఎస్ప్రెష్షో షాట్ 40 మి.లీ
బ్రౌన్ షుగర్ 1 లేదా 2 స్పూన్
కోకో పౌడర్ 4 టీస్పూన్స్
దాల్చిన చెక్క పొడి పావు టీస్పూన్
మిరియాల పొడి పావు టీస్పూన్
వెనీలా సిరప్ 1 టీ స్పూన్
లో ఫ్యాట్ పాలు 120 మి.లీ
విప్డ్ క్రీమ్ గార్నిషింగ్ కోసం..
Also Read : Yoga for Weight Loss : ఈ ఆసనాలతో బరువు తగ్గుతారట..
తయారీ విధానం..
అన్ని పొడి పదార్థాలను ముందుగా ఓ గిన్నెలో వేసి కలపండి.
ఇప్పుడు ఎస్ప్రెస్సో షాట్ వేసి బాగా కలిపాలి. తర్వాత వెనీలా సిరప్ వేయాలి.
ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వేసి బాగా కలపాలి.
ఇలా తయారైన కాఫీని ఓ కప్పులో వేయాలి
ఇప్పుడు పై నుంచి విప్డ్ క్రీమ్‌తో గార్నిష్ చేయండి.
పిస్తా టీ..
ఎస్ప్రెస్సో షాట్ 40 మి.లీ
బ్రౌన్ షుగర్ పావు టీస్పూన్
పిస్తా తరుగు 1 టీ స్పూన్
యాలకుల పొడి 1 టీస్పూన్
లో ఫ్యాట్ మిల్క్
తయారీ విధానం..
ఓ కప్పులో పిస్తా, పంచదార, యాలకుల పొడి వేసి బాగ కలపాలి.
ఇప్పుడు వెచ్చని ఎస్ప్రెస్సో షాట్ వేయాలి.
పై నుంచి లో ఫ్యాట్ మిల్క్ పోమ్ వేయండి
చిటికెడు యాలకుల పొడి, పిస్తా తురుముతో గార్నిష్ చేయండి.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply