PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

boeing: GMRతో జతకట్టనున్న బోయింగ్.. హైదరాబాదులో MRO ఫెసిలిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు

[ad_1]

ఇతర విభాగాల్లోకి సైతం:

ఇతర విభాగాల్లోకి సైతం:

బోయింగ్, ఎయిర్ బస్ ల నుంచి విమానాల కోసం పెద్ద ఎత్తున ఇటీవల ఆర్డర్లు వచ్చిన వేళ ఈ డీల్ బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్కెట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బోయింగ్, ఇండియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. సప్లై చైన్, సోర్సింగ్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతోంది.

డీల్ ఫైనలైజ్ మరింత లేటు:

డీల్ ఫైనలైజ్ మరింత లేటు:

అయితే ప్రస్తుత ఏరో టెక్నిక్ ప్రాజెక్టు గురించి బోయింగ్ లేదా GMR లు స్పందించలేదు. పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన వివరాలను ఆయా సంస్థలు వెల్లడించలేదు. ఈ డీల్ ను ఫైనల్ చేయడానికి, కార్యాచరణను రూపొందించడానికి పనిచేస్తున్నట్లు రెండు కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు తెలిపారు. ఇందుకు 18 నెలల సమయం పడుతుందని వెల్లడించారు.

భారీ డిమాండ్ కారణంగా..

భారీ డిమాండ్ కారణంగా..

మిడ్ లైఫ్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ను కార్గో ప్లేన్లుగా మార్చడానికి బోయింగ్ చూస్తోంది. వివిధ రకాలు ఫ్రైటర్ వెర్షన్లను అది తయారు చేస్తున్నా, అవన్నీ వైడ్ బాడీ విభాగంలో ఉన్నాయి. 737 అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణీకుల జెట్ మోడల్. దీనిని సరుకు రవాణా కోసం మార్చడానికి చూస్తోంది. ఆసియా, ఆఫ్రికాకు చెందిన ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా నారో బాడీ ఫ్రైటర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తోం

భవిష్యత్తులో మరింత వృద్ధి:

భవిష్యత్తులో మరింత వృద్ధి:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరిలో దేశీయ విమాన కార్గో రంగం 1.08 మిలియన్ టన్నులుగా ఉన్నట్లు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. ఏడాదికేడాది 10.6 శాతం మేర పెరుగుదల నమోదు చేసినట్లు వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2021-22లో 24 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 1,700 పైగా కన్వర్టెడ్ ఫ్రైటర్లకు డిమాండ్ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *