హైబీపీని కంట్రోల్‌లో ఉంచే.. 7 సూపర్‌ ఫుడ్స్‌ ఇవే..!

[ad_1]

​World Hypertension Day: ఈ రోజు ‘వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ డే’. అధిక రక్తపోటుపై అందరికీ అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 17న ప్రపంచ హైపర్‌టెన్షన్‌ డేను నిర్వహిస్తున్నారు. ఈ రోజును 2005లో వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ హైపర్‌టెన్షన్ డేగా ప్రకటించింది. అధిక రక్తపోటు.. ‘సైలెంట్ కిల్లర్’ వ్యాధి. హైపర్‌టెన్షన్‌ .. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, చూపు కోల్పోవడం, మానసిక సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. హైబీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి రోజు మందులు వాడుతూనే.. మనం తీసుకునే ఆహారంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు మన రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సూపర్‌ ఫుడ్స్‌ మీ డైట్‌లో చేర్చుకుంటే.. హైపర్‌టెన్షన్‌ను ఈజీగా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.

ఫ్యాటీ ఫిష్‌..

ఫ్యాటీ ఫిష్‌..

సాల్మన్‌, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌ ఉంచడానికి సహాయపడతాయి. రక్తనాళలను రెస్ట్రిక్ట్‌ చేసే ఆక్సిలిపిన్స్ సమ్మేళనాలను తగ్గించడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ తోడ్పడతాయి.

(image source – pixabay)

హైపర్ టెన్షన్ ఎందుకొస్తుందంటే..

హైపర్ టెన్షన్ ఎందుకొస్తుందంటే…

విత్తనాలు..

విత్తనాలు..

విత్తనాలు.. హైపర్‌టెన్షన్‌ పేషెంట్స్‌కు సూపర్‌ఫుడ్‌ అనొచ్చు. మీ బ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గించుకోవాలంటే.. మీ డైట్‌లో అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్‌ వంటి విత్తనాలు చేర్చుకోండి. ఈ విత్తనాలలో పొటాషియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు, నైట్రిక్ ఆక్సైడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను రిలాక్స్‌ చేసి.. హైపర్‌టెన్షన్‌ను నియంత్రిస్తాయి.

(image source – pixabay)

ఇలా నిద్రపోతే.. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

గ్రీన్ టీ..

గ్రీన్ టీ..

హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి.. గ్రీన్‌ టీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ధమనులను ఎక్స్‌పాండ్‌ చేసి.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది హైపర్‌టెన్షన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. హైపర్‌టెన్షన్‌ పేషెంట్స్‌ రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్‌ టీ తాగితే మంచిది.

(image source – pixabay)

ఈ అలవాట్లు మార్చుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం..!

గుడ్డు తెల్లసొన..

గుడ్డు తెల్లసొన..

గుడ్డు తెల్లసొన హైపర్‌టెన్షన్‌ తగ్గిస్తుంది ఇటీవలి జరిగిన అధ్యయనం స్పష్టం చేసింది. దీనిలో పుష్కలంగా ఉండే ప్రొటీన్స్‌.. మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

(image source – pixabay)

​చిక్కుళ్లు..

​చిక్కుళ్లు..

చిక్కుళ్లు, బీన్స్‌, తృణధాన్యాల్లో ప్రొటీన్స్‌ మెండుగా ఉంటాయి. హైపర్‌టెన్షన్‌ పేషెంట్స్‌ వారి డైట్‌లో చేర్చుకుంటే బీపీ గణనీయంగా.. తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

బెర్రీస్‌..

బెర్రీస్‌..

హైపర్‌టెన్షన్‌ ఉన్నవారికి.. బెర్రీస్‌ మరొక గొప్ప సూపర్‌ ఫుడ్‌ అనొచ్చు. బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి హైపర్‌టెన్షన్‌ తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. దీర్ఘకాలిక గుండె జబ్బులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(image source – pixabay)

ఈ టిప్స్‌ ఫాలో అయితే.. హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది

క్రూసిఫరస్ కూరగాయలు..

క్రూసిఫరస్ కూరగాయలు..

కాలీఫ్లవర్‌, బ్రకోలీ, క్యాబేజీ, కాలే, పాలకూర…. క్రూసిఫెరస్ కూరగాయల క్రిందకు వస్తాయి. వాటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు హైపర్‌టన్షన్‌, స్ట్రోక్‌, గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి.

ఇవి రోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే.. హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది..!


గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *