News
oi-Chekkilla Srinivas
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ భారీ క్షీణతతో పాటు ఈ విషయమై విచారణ జరపాలని ప్రతిపాక్షలు డిమాండ్ చేస్తున్నాయి. అదానీ గ్రూప్ సంబంధించి హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై విచారణ జరపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి అమెరికాకు చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ జార్జ్ సోరోస్ పలు వ్యాఖ్యలు చేశారు.
గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ఇటీవల చెలరేగిన కల్లోలం భారత సర్కారుపై మోదీ పట్టును బలహీనపర్చే అవకాశముందని హెడ్జ్ తెలిపారు. ప్రజస్వామ్య పునరుద్ధరణకు కూడా అది తలుపులు తెరవొచ్చని వ్యాఖ్యలు చేయడంతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం విరుచుకుపడ్డారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మీడియాను ఉద్దేశించి జైశంకర్ మాట్లాడిన జైశంకర్ జార్జ్ సోరస్‌కు వయసుమళ్లిందన్నారు. “అతను మూర్ఖమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి. న్యూయార్క్‌లో ఉండే ఈ వ్యక్తి .. ప్రపంచం మొత్తం ఎలా పనిచేయాలో తన అభిప్రాయాలే నిర్ణయించాలని ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇలాంటివారు తమకు అనుకూల కథనాలు రూపొందడంలో పెట్టుబడులు పెడుతుంటారు. వారు తమకు అనుకూల వ్యక్తి అధికారంలోకి వస్తే.. ఎన్నికలు సక్రమంగా జరిగాయంటారు” అని విమర్శించారు.
“బయటి జోక్యం ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో మాకు తెలుసు . మీరు ఇలాంటి భయాందోళనలకు గురిచేస్తే, లక్షలాది మంది పౌరసత్వం కోల్పోతారు. ఇది వాస్తవానికి మన సామాజిక ఫాబ్రిక్‌కు నిజమైన నష్టాన్ని కలిగిస్తుంది ” అని చెప్పారు.
English summary
External Affairs Minister Jaishankar criticized the comments of American investor George Soros
After the Hindenburg report, the opposition has demanded an inquiry into the Adani Group’s massive decline.
Story first published: Saturday, February 18, 2023, 15:48 [IST]