News
lekhaka-Bhusarapu Pavani
adani:
హిండెన్
బర్గ్
ఆరోపణల
అనంతరం
పలు
ఇబ్బందులు
ఎదుర్కొన్న
అదానీ
గ్రూపు..
నష్ట
నివారణ
చర్యలకు
దిగిన
విషయం
తెలిసిందే.
వినియోగదారుల
విశ్వాసాన్ని
తిరిగి
పొందేందుకు
ఇప్పటికే
వివిధ
రుణాలను
మెచ్యూరిటీకి
ముందే
చెల్లించడం,
కుదువ
పెట్టిన
షేర్లను
విడిపించుకోవడ
వంటివి
చేస్తోంది.
ఇందులో
భాగంగా
మరో
పని
చేయడానికి
రంగం
సిద్ధం
చేసింది.
ఓ
యూనిట్
జారీచేసిన
100
మిలియన్
డాలర్ల
బాండ్లను
తిరిగి
కొనుగోలు
చేసేందుకు
అదానీ
ట్రాన్స్‌మిషన్
లిమిటెడ్
యత్నిస్తున్నట్లు
విశ్వసనీయ
వర్గాలు
తెలిపాయి.
పెట్టుబడిదారుల్లో
ధైర్యం
నింపేందుకు
ఈ
ప్రయత్నం
చేస్తున్నట్లు
తెలుస్తోంది.
అనుబంధ
సంస్థ
అదానీ
ఎలక్ట్రిసిటీ
ముంబై
లిమిటెడ్
ద్వారా
త్వరలో
బాండ్
బైబ్యాక్
ను
ప్రకటిస్తుందని
సమాచారం.

ఈ
డీల్
సాఫీగా
పూర్తయ్యేందుకు
కొన్ని
బ్యాంకులు
అదానీ
ట్రాన్స్‌మిషన్
తో
కలిసి
పనిచేస్తున్నట్లు
తెలిసింది.
అయితే
ఈ
వార్తలపై
అదానీ
గ్రూపు
ప్రతినిధి
స్పందించలేదు.
కాగా
డిసెంబర్
2022
నాటికి
35
బిలియన్
రూపాయల
నగదు
అదానీ
ట్రాన్స్‌మిషన్
వద్ద
ఉంది.
ఇప్పటికే
ప్లాన్
చేసిన
లావాదేవీలు
పూర్తి
చేయడానికి
ఈ
నిధులు
సరిపోతాయని
గత
ఫిబ్రవరి
కాన్ఫరెన్స్
కాల్
లో
సంస్థ
మేనేజింగ్
డైరెక్టర్
అనిల్
సర్దానా
వెల్లడించడం
గమనార్హం.
కేవలం
అదానీ
ట్రాన్స్
మిషన్
లిమిటెడ్
మాత్రమే
కాక
అదానీ
పోర్ట్స్
&
స్పెషల్
ఎకనామిక్
జోన్
లిమిటెడ్
సైతం
ఇదే
బాటలో
ముందుకు
సాగడానికి
ప్రణాళికలు
రచిస్తోంది.
ఇందుకు
అనుగుణంగా
తన
జూలై
2024
బాండ్‌లలో
130
మిలియన్
డాలర్ల
బైబ్యాక్
తో
పాటు
మరియు
తదుపరి
4
త్రైమాసికాల్లోనూ
ఈ
తరహా
కొనుగోళ్లు
జరపాలని
యోచిస్తున్నట్లు
గత
నెలలో
కంపెనీ
తెలిపింది.
English summary
Adani Transmission planning for $100 Mn worth bonds buy back
Adani Transmission planning for $100 Mn worth bonds buy back
Story first published: Friday, May 5, 2023, 7:20 [IST]