PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

adani: హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం అదానీ కంపెనీల నష్టాలు ఎంతంటే..

[ad_1]

ఆదాయం పెరిగినా..

ఆదాయం పెరిగినా..

ఫిబ్రవరి 14న అదానీ ఎంటర్‌ ప్రైజైస్ ఫలితాలు మార్కెట్‌ లో విడుదలయ్యాయి. ఇదే సమయంలో గతేడాది నమోదుచేసిన రూ.11.63 కోట్ల నష్టంతో పోలిస్తే, ఈసారి రూ.820 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. అంటే ఆదాయం 42 శాతం పెరిగింది. ఫలితాల అనంతరం కనిష్ఠ స్థాయి నుంచి 17 శాతానికి ఎగబాకింది. కానీ మూడీస్ సంస్థ తన రేటింగ్ ను ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలత’గా మార్చడంతో చివరికి 1.8 శాతం లాభపడి రూ.1,750 వద్ద ట్రేడింగ్ ముగిసింది.

రేటింగ్ సంస్థలు నెగిటివ్‌ గా..

రేటింగ్ సంస్థలు నెగిటివ్‌ గా..

అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, ACC ఫ్రీ-ఫ్లోట్ స్టేటస్‌ ను ఫైనాన్షియల్ ఇండెక్స్ ప్రొవైడర్ MSCI తగ్గించడంతో.. మూడీస్‌ సైతం కొన్ని గ్రూపు కంపెనీల రేటింగ్‌ ను డౌన్‌ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతకుముందు S&P గ్లోబల్ రేటింగ్స్ కూడా ప్రతికూల దృక్పథాన్ని కనబరిచింది. వీటికి తోడు, గ్రూపు వృద్ధి లక్ష్యాలను 40 శాతం నుంచి 15-20 శాతానికి అదానీ మేనేజ్‌ మెంట్‌ తగ్గించినట్లు నివేదికలు బయటకు రావడమూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

అప్పటి నుంచీ నష్టాలబాటే:

అప్పటి నుంచీ నష్టాలబాటే:

జనవరి 24 నుంచి చూస్తే అంబుజా, ACC, NDTVతో సహా అదానీ గ్రూపు స్టాక్ ‌లు దాదాపు రూ.10.2 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇది వాటి మొత్తం ఉమ్మడి మార్కెట్ క్యాప్‌ లో దాదాపు 53 శాతం. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ వరుసగా 77, 73, 70 శాతం చొప్పున క్షీణించాయి. అదే సమయంలో NDTV, అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మర్ లో 53 నుంచి 65 శాతం మధ్య నష్టాలను మూటగట్టుకున్నాయి.

మిక్స్ డ్ టాక్:

మిక్స్ డ్ టాక్:

ఫిబ్రవరి చివరి నాటికి MSCI ఇండెక్స్ లో సర్దుబాటు కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, ACCల నుంచి మరో రూ.3,450 కోట్లు బయటకు మళ్లవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు సైతం భారీ ఎత్తున తమ పోర్ట్ ఫోలియో నుంచి అదానీ కంపెనీల స్టాక్‌ విలువను తగ్గించుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. కానీ అగ్రెసివ్, రిస్క్ ట్రేడర్స్ ప్రస్తుత వాలటాలిటీని వినియోగించుకుని వెంటనే బయటపడితే మంచి లాభాలు గడించవచ్చని పేర్కొనే వారూ ఉన్నారు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *