PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Aloe Vera juice: ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే బరువు తగ్గడమే కాదు, షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

[ad_1]

Aloe Vera juice: కలబంద అద్భుతమై మూలిక. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కలబంద మొక్క దర్శనమిస్తుంది. దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్‌ ఉంటాయి. దీనిలో కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

కలబంద జ్యూస్‌ ఇలా రెడీ చేసుకోండి..

కలబంద జ్యూస్‌ ఇలా రెడీ చేసుకోండి..

కలబంద జ్యూస్‌ చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్‌ నీళ్లలో 5 టేబుల్‌ స్పూన్ల కలబంద గుజ్జు, కొంచెం నిమ్మరసం, తేనె వేసుకోవాలి. ఆ తర్వాత టేస్టీ జూస్‌ ఎంజాయ్‌ చేయండి. (Image source – pixabay)

అధిక బరువు తగ్గాలంటే ఏం చేయాలి

అధిక బరువు తగ్గాలంటే ఏం చేయాలి |

బరువు తగ్గుతారు..

బరువు తగ్గుతారు..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే.. బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి, శరీరాన్ని క్లీన్ చేస్తాయి. శరీరంలో టాక్సిన్స్ తొలగితే.. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది, పోషకాలను గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ త్వరగా బరువు తగ్గడానికి తోడ్పడుతోంది. (Image source – pixabay)

డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

షుగర్‌ పేషెంట్స్‌ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కలబందలో లెక్టిన్లు, ఆంత్రాక్వినోన్స్ ఉంటాయి. వీటిలో సహజంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. షుగర్‌ పేషెంట్స్‌ కలబంద జ్యూస్‌ తాగేముంపు డాక్టర్‌ను సంప్రదించడం మేలు. ప్రీడయాబెటిస్‌, టైప్‌2 డయాబెటిస్‌ ఉన్న వారి రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కలబంద రసాన్ని సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ మెరుగుపడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.

మలబద్ధకానికి చెక్‌..

మలబద్ధకానికి చెక్‌..

మలబద్ధకంతో బాధపడేవారికి కలబంద ఔషధంలా పనిచేస్తుంది. కలబందలో విటమిన్లు, మినరల్స్, యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా తోడ్పడతాయి. మలాన్ని మృదువుగా చేసి.. మలబద్ధకానికి చెక్‌ పెడతాయి. ఇది ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే.. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

ఈ సమస్యలు దూరం..

ఈ సమస్యలు దూరం..

జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే మేలు జరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD), గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యలను కలబంద పరిష్కరిస్తుంది. ఉదయాన్నే కొద్ది మొత్తంలో కలబంద రసం తాగితే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (GERD) వచ్చే ముప్పును తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నారు. (Image source – pixabay)

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది..

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది..

కలబంద రసంలో విటమిన్‌ సీ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌ సీ మానవ శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కలబంద జ్యూస్‌ సహాయపడుతుంది.

Wrong food combinations: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా..?

చర్మం ఆరోగ్యంగా..

చర్మం ఆరోగ్యంగా..

ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే.. చర్మాన్ని మృదువుగా తాజాగా చేయడంతోపాటు మెరుపునూ అందిస్తుంది. కురులను బలంగా మారుస్తుంది… మృదుత్వాన్నీ ఇస్తుంది.

(Image source – pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *