News
oi-Mamidi Ayyappa
Amazon
Jobs:
ఒకపక్క
ప్రపంచ
వ్యాప్తంగా
ఉద్యోగులను
కంపెనీలు
తొలగిస్తున్న
వేళ
అమెజానా
గుడ్
న్యూస్
వెల్లడించింది.
భారతదేశంలో
క్లౌడ్
సేవలకు
పెరుగుతున్న
డిమాండ్‌ను
తీర్చడానికి
తన
పెట్టుబడి
ప్రణాళికను
వెల్లడించింది.
కంపెనీ
తీసుకున్న
పెట్టుబడి
నిర్ణయం
వల్ల
ఏటా
దేశంలో
సగటున
131,700
ఉద్యోగాల
కల్పన
జరుగుతుందని
కంపెనీ
అంచనా
వేసింది.
ఇటీవలి
పెట్టుబడి
ప్రణాళికతో
దేశంలో
AWS
మొత్తం
పెట్టుబడి
2030
నాటికి
16.4
బిలియన్
డాలర్లకు
పెరుగుతుంది.
2016-22
మధ్య
కాలంలో
కంపెనీ
మనదేశంలో
దాదాపు
3
బిలియన్
డాలర్లకు
పైగా
పెట్టుబడులను
పెట్టింది.

AWS
భారతదేశం
డిజిటల్
పవర్‌హౌస్‌గా
చాలా
కాలం
నుంచి
అభివృద్ధి
చెందుతోందని
సీఈవో
ఆడమ్
సెలిప్‌స్కీ
వెల్లడించారు.
భారీ
ప్రపంచ
అనిశ్చితి
యుగంలో
భారత్
“ప్రకాశవంతమైన
ప్రదేశం”గా
నిలిచిందని
ఆయన
వెల్లడించారు.
సాంప్రదాయ
పద్ధతిలో
సాగుతున్న
వ్యపారాలు
డిజిటల్
బాట
పట్టేందుకు
కంపెనీ
సేవలు
కీలకంగా
మారనున్నాయి.
భారతదేశంలో
డిజిటల్
ఆవిష్కరణలు
చాలా
వేగంగా
సాగుతున్నట్లు
ఆయన
వెల్లడించారు.
అమెరికా
యూరప్
మార్కెట్ల
కంటే
భారత
మార్కెట్
మెరుగ్గా
ఉందని
సీఈవో
వెల్లడించారు.
2025
నాటికి
ట్రిలియన్
డాలర్ల
డిజిటల్
ఎకానమీని
నిర్మించడానికి
భారత
ప్రభుత్వం
ప్రయత్నిస్తోందని
తెలిపారు.
ఈ
ఆశయాలను
సాకారం
చేసుకోవడానికి
క్లౌడ్
టెక్నాలజీని
స్వీకరించడం
భారతదేశానికి
కీలకమని
ఆయన
అన్నారు.
దీనికి
అవసరమైన
డేటా
సెంటర్లను
ఇండియాలో
విస్తరిస్తున్నట్లు
కంపెనీ
తెలిపింది.
ప్రస్తుతం
కంపెనీకి
ముంబై,
హైదరాబాదుల్లో
సెంటర్లు
ఉన్నాయి.
English summary
AWS mega cloud business expansion plans in india to generate 1.32 lakh jobs every year
AWS mega cloud business expansion plans in india to generate 1.32 lakh jobs every year
Story first published: Thursday, May 18, 2023, 18:15 [IST]