PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Ambani-Adani: దివాలా తీసిన కంపెనీ కోసం పోటీ.. నువ్వా నేనా అంటూ రేసులో అదానీ అంబానీలు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Ambani-Adani: ఫ్యూచర్ రిటైల్‌ గ్రూప్ అమెజాన్ కారణంగా దాదాపుగా దివాలా అంచుకు చేరుకుంది. అయితే దీనిని తొలుత అంబానికి చెందిన రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకోవాలని చూసింది కానీ చట్టపరమైన చిక్కుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా కంపెనీ దివాలా పరిష్కారానికి గడువును జనవరి 15 వరకు అంటే ఒక నెలపాటు పొడిగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో షేర్ల ట్రేడింగ్ నిలిచిపోయింది. పైగా చాలా మంది ఈ కంపెనీని సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తూ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ నుంచి స్పష్టత కోరినట్లు తెలుస్తోంది.

గతంలోనూ ఈ గడువు నిరంతరం పొడిగించటం జరిగింది. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దివాలా పరిష్కారానికి తుది బిడ్‌ల సమర్పణకు గడువు డిసెంబర్ 15గా ఉంది. కోర్టు నియమించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ నవంబర్ 20న ఫ్యూచర్ రిటైల్ కోసం సంభావ్య బిడ్డర్లుగా 13 ఎంటిటీలను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ ఎంటిటీలన్నీ కంపెనీ పట్ల తమ ఆసక్తిని కనబరిచి, ప్రారంభ బిడ్ (EoI)ని సమర్పించిన విషయం మనందరికీ తెలిసిందే.

Ambani-Adani: దివాలా తీసిన కంపెనీ కోసం పోటీ.. నువ్వా నేనా అం

దీనికి ముందు EOI గడువు అక్టోబర్‌లో పొడిగించబడింది. వివిధ భవిష్యత్ రిటైల్ రుణదాతలు క్లెయిమ్ చేసిన మొత్తాన్ని ధృవీకరించే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అందుకే గడువును పెంచుతున్నట్లు తెలిసింది. గడువు పొడిగించినప్పటికీ బిడ్డింగ్ పై ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య చాలా స్వల్పంగానే పెరిగింది.

రేసులో అదానీ, అంబానీలు కూడా ఉండటం హీట్ పెంచుతోంది. అంబానీలకు చెందిన రిలయన్స్ గ్రూప్ ముందు నుంచే దీనిని దక్కించుకునేందుకు ముందు వరుసలో ఉండగా.. అనుకోకుండా అదానీ కూడా దీనిపై ఆసక్తి కనబరిచారు. అందువల్ల దాఖలైన బిడ్లలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్, మూన్ రిటైల్ (అదానీ గ్రూప్, ఫ్లెమింగో గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్) కూడా ఈ రేసులో నిలిచాయి. కంపెనీ ఈ పరిస్థితి కారణంగా దాని షేర్లు ఏడాది కాలంలో దాదాపుగా 93.64% నష్టపోయాయి. ఈ క్రమంలో షేర్ ధర రూ.47 నుంచి ఏకంగా రూ.3.05కి క్షీణించింది. డిసెంబర్ 12 నుంచి కంపెనీ షేర్ల ట్రేడింగ్ మార్కెట్లో మూసివేయబడింది.

English summary

Ambani and Adani are in race to acquire debt ridden Future retail know details

Ambani and Adani are in race to acquire debt ridden Future retail know details

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *