[ad_1]
తలకిందులైన కంపెనీ..
భారత టెలికాం రంగంలో ఒకప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ సంచలనాలను సృష్టించింది. ఖరీదైన టెలికాం సేవలను ప్రజలకు అందుబాటు ధరల్లోకి తెచ్చిన తొలి స్వదేశీ కంపెనీగా చరిత్రలో నిలిచిపోయింది. కానీ కంపెనీకి గడ్డు కాలం మెుదలు కావటంతో ఇదంతా మాయమైపోయింది. 2008 జనవరిలో Rcom ఒక్కో షేర్ ధర రూ.820 వద్ద ఉంది. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో దీని ధర రూ.2.10కి పడిపోవటం ఇన్వెస్టర్ల తలరాతను మార్చేసింది.
పాతాళానికి స్టాక్..
స్టాక్ ధర దాదాపుగా 99 శాతం క్షీణించటం ఇన్వెస్టర్లను పేదవారిగా మార్చేసింది. కంపెనీ షేర్లు దీర్ఘకాలంలో హోల్డ్ చేసిన వారు భారీ సంపద క్షీణతను చూడాల్సి వచ్చింది. 2006లో కంపెనీలో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో రూ.లక్ష విలువైన వాటాలను కొనుగోలు చేస్తే.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పెట్టుబడి విలువ రూ.700కి పడిపోయింది. ఇది నిజంగా చాలా దారుణం అని చెప్పుకోవాలి.
అప్పుల ఊబిలో కంపెనీ..
అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. భారత టెలికాం రంగంలోని దిగ్గజాల జాబితాలో కంపెనీ కూడా ఒకటి. అయితే టెలికాం రంగంలో భారీ టారిఫ్ యుద్ధం ప్రారంభమైన తర్వాత.. RCom భారీ నష్టాలను చవిచూడటం ప్రారంభించింది. ఈ పోటీని తన అన్న ముఖేష్ అంబానీ స్వయంగా జియోని ప్రవేశపెట్టి ప్రారంభించారు. Jio ఉచిత కాల్స్, చౌక డేటా దాదాపు RComను నాశనం చేసి, భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయి కోలుకోలేని స్థితికి కారణమైంది.
డిసెంబర్ 19 నుంచి..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ విక్రయ ప్రక్రియలోని ఈ-వేలం నిర్వహణకు సంబంధించిన నియమాలు, విధానాలను రుణదాతలు ఖరారు చేశారు. ఈనెల 19న ప్రారంభమవుతున్న ఈ ప్రక్రియలో వేలం బేస్ ప్రైస్ రూ.5,300 కోట్లుగా నిర్ణయించటం జరిగింది.
అయితే ఈ కంపెనీని సొంతం చేసుకునేందుకు ఇప్పటికే చాలా దేశీయ దిగ్గజాలు ఆసక్తి చూపుతూ ముందంజలో నిలిచాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున ఈ-వేలం నిర్వహించడం ఇదే తొలిసారని తెలుస్తోంది.
[ad_2]
Source link
Leave a Reply