PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Artemis 1 Mission నేడు భూమిపైకి నాసా క్యాప్సుల్.. మీరూ లైవ్‌లో చూడొచ్చు ఇలా

[ad_1]

Artemis 1 Mission చంద్రుడిపై అధ్యయనానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అర్టెమిస్-1 మిషన్‌‌ను నవంబరు 16న ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆర్టిమిస్-1కు చెందిన ఓరియన్ క్యాప్సుల్ తిరిగి ఆదివారం రాత్రి భూవాతావరణంలోకి ప్రవేశించి పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనుంది. చంద్రుడి ఉపరితల వాతావరణంలో చివరి దశ యాత్రను పూర్తిచేసుకుని భూమికి తిరిగొస్తున్న ఈ క్యాప్సుల్ అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు సముద్రంలో పడుతుందని నాసా అంచనా వేస్తోంది. నిర్దేశించిన సమయం ప్రకారం ఈ ప్రక్రియ వారం కిందటే ప్రారంభమైంది.

ఓరియన్ క్యాప్సుల్‌లోని ఇంజిన్ల శక్తిమంతమైన కదలికల కారణంగా దిశ మారింది. దాంతో చంద్రుడి ఉపరితలం నుంచి భూమివైపు పయనించడం ప్రారంభించింది.భూమివైపు తిరిగొచ్చేటప్పుడు గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గరిష్ఠ వేగాన్ని అందుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో దిగే సమయానికి వేగాన్ని గంటకు 32 కిలోమీటర్లకు నియంత్రించనున్నారు. ఇది మెక్సికో సమీపంలో బజా కాలిఫోర్నియా తీరం గ్వాడాలుపే ద్వీపంలో పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. లైవ్ స్ట్రీమింగ్ రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానుంది.

డిసెంబరు 10న అర్టెమిస్-1 మిషన్ చివరి స్పేస్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ టెస్ట్‌ను నాసా ఇంజినీర్లు నిర్వహించారు. ఈ సమయంలో విడుదలయ్యే వాయువుల అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని వర్గీకరించారు. ఫ్లైట్ కంట్రోలర్‌లు టార్క్‌ను బ్యాలెన్స్ చేయడానికి వ్యతిరేక థ్రస్టర్‌లను ఉపయోగించి అంతరిక్ష నౌక ప్రతిచర్య నియంత్రణ వ్యవస్థలను తొలగించారు.

డిసెంబరు 11, ఆదివారం తెల్లవారుజామున అంతరిక్ష సంస్థ మిషన్ కోసం ఐదో రిటర్న్ ట్రాజెక్టరీ కరెక్షన్‌ను కూడా నాసా నిర్వహించింది. మిషన్‌కు చివరిదైన ఆరో ట్రాజెక్టరీ బర్న్‌ను ఓరియన్ క్యాప్సుల్ భూవాతావరణంలోకి ప్రవేశించడానికి సుమారు ఐదు గంటల ముందు నిర్వహిస్తారు.

రీఎంట్రీకి ముందు ఓరియన్ క్రూ మాడ్యూల్ సర్వీస్ నుంచి విడిపోయి భూమి వాతావరణంలో మండిపోతుంది. కానీ సర్వీస్ మాడ్యూల్ విడిపోయే ముందు స్పేస్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్‌లు నాసా డీప్ స్పేస్ నెట్‌వర్క్ నుంచి సమీపంలోని స్పేస్ నెట్‌వర్క్‌కి మారుతాయి. ఓరియన్ కమ్యూనికేషన్‌ వ్యవస్థను నాసా ట్రాకింగ్, డేటా రిలే శాటిలైట్ (TDRS) ద్వారా బదిలీ అవుతాయి.

ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్, ఓరియన్ క్యాప్సుల్‌లు వ్యోమగాములను చంద్రుడి మీదకు సురక్షితంగా తీసుకెళ్లి, వెనక్కి తీసుకు రాగలవా? అని తెలుసుకునేందుకే నాసా ఈ ప్రయోగం చేపట్టింది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 2024లో నాసా ఆర్టెమిస్-2 ప్రయోగం ద్వారా వ్యోమగాములను పంపనుంది. అది కూడా విజయవంతమైతే 2025లో అర్టెమిస్- 3 ద్వారా తొలి మహిళా వ్యోమగామిని చంద్రుడి మీదకి పంపిస్తారు.

Read Latest Science and Technology News And Telugu News

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *