News
oi-Mamidi Ayyappa
Aswath
Damodaran:
ప్రఖ్యాత
వ్యాల్యుయేషన్
గురు
అశ్వత్
దామోదరన్
అమెరికా
బ్యాంకింగ్
సంక్షోభంపై
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
ప్రస్తుతం
స్టెర్న్
స్కూల్
ఆఫ్
ఫైనాన్స్‌లో
ప్రొఫెసర్‌గా
ఉన్న
దామోదరన్
అంతర్జాతీయ
మార్కెట్లను
ఆందోళనకు
గురిచేస్తోంది.
అసలు
పరిస్థితులు
ఎలా
ఉన్నాయంటే..?

అమెరికాలో
వరుసగా
మూడో
బ్యాంక్
కుప్పకూలటం
ప్రపంచ
వ్యాప్తంగా
ప్రకంపనలు
రేపుతోంది.
అయితే
ఈ
ఉపద్రవం
ఇక్కడితో
ముగియలేదని
యూఎస్
బ్యాంకింగ్
వ్యాపారంలో
మరిన్ని
కంపెనీలు
పతనం
కాబోతున్నాయని
అశ్వత్
శనివారం
అన్నారు.
సిలికాన్
వ్యాలీ
బ్యాంక్
సంక్షోభం
తర్వాత
అనేక
ప్రాంతీయ
బ్యాంకుల్లో
డిపాజిట్ల
ఉపసంహరణ
వేగం
పెరిగింది.
ఇదే
సమయంలో
ఆ
బ్యాంకుల
షేర్లు
భారీగా
పతన
కావటం
కొనసాగుతోంది.

చివరగా
పతనమైన
ఫస్ట్
రిపబ్లిక్
బ్యాంక్
ను
జేపీ
మోర్గన్
స్వాధీనం
చేసుకుంది.
అయితే
ప్రస్తుత
సంక్షోభం
2008
మాదిరిగా
కాకుండా..
బ్యాంకుల
అంతటా
సంపదను
పునఃపంపిణీ
చేసే
అవకాశం
ఉందని
భావిస్తున్నట్లు
ప్రొఫెసర్
వెల్లడించారు.
2023లో
బ్యాంకింగ్
సంక్షోభం
స్లో-మోషన్
కార్
ధ్వంసంలా
కనిపిస్తోందని
అన్నారు.
అయితే
బ్యాంకింగ్
సంక్షోభాన్ని
అర్థం
చేసుకోవాలంటే
ముందుగా
దాని
ప్రాథమిక
వ్యాపార
స్వభావాన్ని
అర్థం
చేసుకోవాలన్నారు.
There
will
be
other
dominos
that
fall,
bank
concentration
(not
profitability)
will
rise,
systemic
effects
will
stay
small,
accounting
rules
on
mark
to
market
will
be
tightened
and
regulators
will
add
duration
mismatch
&
deposit
stickiness
to
the
rule
book.
https://t.co/DOXKexcG3d—
Aswath
Damodaran
(@AswathDamodaran)
May
6,
2023
మంచి
సమయాల్లో
ఇన్వెస్టర్లు,
రెగ్యులేటర్లు
చెడ్డ
బ్యాంకులను
పట్టికోరని
దామోదరన్
అభిప్రాయపడ్డారు.
అయితే
ప్రస్తుతం
మార్కెట్లో
ఉన్న
అధిక
వడ్డీ
రేట్లు,
మాంద్యం
వంటి
పరిస్థితులు
సదరు
బ్యాంకులను
వెలుగులోకి
తెస్తాయని
అన్నారు.
డిపాజిట్లలో
అత్యధిక
వృద్ధిని
సాధించిన
బ్యాంకుల
వద్ద
మార్కెట్
క్యాప్
నష్టం
ఎక్కువగా
ఉందని
స్పష్టమవుతోందని
ఆయన
వెల్లడించారు.
తాజా
సంక్షోభం
వల్ల
అకౌంటింగ్
నియమాలు,
రెగ్యులేటరీ
ఫ్లేమ్
వర్క్
మరింత
కఠినతరంగా
మారనుందని
తెలిపారు.
English summary
Valuation guru Aswath Damodaran warns more dominos ready to fall amid US Banking crisis
Valuation guru Aswath Damodaran warns more dominos ready to fall amid US Banking crisis..