Buddhas Hand: ఈ వింత ఆక్టోపన్ ఆకారంలో ఉన్న ఈ పండు పేరు బుద్ధాస్ హ్యాండ్. అంటే బుద్ధుని చేయి. ఈ పండును చైనా, ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. ఇది నిమ్మ కుటుంబానికి చెందిన పండు, దీనికి సిట్రస్ వాసన, టేస్ట్ ఉంటాయి. దీని విచిత్రమైన ఆకారం కారణంగా దీనికి బుద్ధాస్ హ్యాండ్ అని పేరు పెట్టారు. ఈ పండ్లు చూడటానికి, ధ్యాన భంగిమలో కూర్చున్న బుద్ధుని చేతి వేళ్లలా కనిపిస్తుంది. చైనాలో ప్రాచీన కాలం నుంచి బుద్ధాస్ హ్యాండ్‌ను అనేక రకాల వ్యాధుల చికిత్సకు ఔషధంలా వాడతారు. దీనిని పెర్ఫ్యూమ్ తయారీలో, డెకరేటివ్ పండుగానూ ఉపయోగిస్తారు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Source link