[ad_1]
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీస్ అభివృద్ధి, ఉపరితలంపై పరిశోధనలు, అక్కడి వనరులను గుర్తించేందుకు ఏడాది పాటు ఇది పనిచేయనున్నట్లు రోస్‌కాస్మోస్ వెల్లడించింది. ‘చరిత్రలో తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ జరగనుంది. ఇప్పటి వరకు అందరూ చంద్రుడి భూమధ్యరేఖ జోన్‌లోనే దిగుతున్నారు’ అని రోస్‌కాస్మోస్ అధికారి అలెగ్జాండర్ బ్లోఖిన్ చెప్పారు. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి మొదటి మూన్ మిషన్ ఇదే. గత కొన్నేళ్లుగా పలు సమస్యలతో సతమతమవుతూ.. ఉక్రెయిన్‌పై దాడితో ఒంటరైన సమయంలో రష్యా ఈ ప్రయోగం చేపట్టడం విశేషం. అంతేకాదు, చంద్రుడిపై అన్వేషణకు భారత్ చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించిన కొద్ది వారాల్లోనే లునా-25ను పంపడం గమనార్హం.
ఇప్పటి వరకూ ఎవరూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని ఇస్రోకు (ISRO) భావిస్తుండగా.. రష్యా రష్యా (Russia) చేపట్టిన ‘లునా -25’ పోటీ ఇస్తోంది. చంద్రయాన్-3 ఆగస్టు 23న ల్యాండింగ్ చేయనుండగా.. అంతకు ముందే రష్యా పంపిన లూనా-25 ల్యాండ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆగస్టు 21న ల్యాండింగ్ చేస్తారని సమాచారం. ఇది కేవలం ల్యాండర్ మిషన్ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు, డ్రిల్లింగ్ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి.
రష్యా అంతరిక్ష నిపుణుడు విటాలి ఇగోరోవ్ ప్రకారం.. సోవియట్ విచ్ఛిన్నం అనంతరం చంద్రుడిపై పరిశోధనలకు రష్యా ప్రయత్నించడం ఇదే మొదటిసారి. ‘ఇది సాఫీగా దిగగలదా? అనేది అతిపెద్ద ప్రశ్న.. ఈ మిషన్ రష్యాకు చాలా ముఖ్యమైంది’ అని ఆయన నొక్కి చెప్పారు. తమపై ఆంక్షలు ఉన్నప్పటికీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా 1961లో అంతరిక్షంలోకి మొదటి మనిషిని పంపిన విషయాన్ని గుర్తుచేశారు.
గతేడాది వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్‌లో పుతిన్ మాట్లాడుతూ.. ‘కష్టాలు, బాహ్య ప్రపంచ ఆంక్షలు ఉన్నప్పటికీ ముందుకు సాగాలనే మా పూర్వీకుల ఆశయం ద్వారా మేము మార్గనిర్దేశం చేస్తున్నాం’ అని పుతిన్ వివరించారు.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply