[ad_1]
చంద్రయాన్ 3 లాంచ్‌ప్యాడ్‌ను జార్ఘండ్‌లోని రాంచీలో ఉన్న హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ – హెచ్‌ఈసీ సిద్ధం చేసింది. అయితే లాంచ్‌ప్యాడ్ తయారీకి ఇచ్చిన గడువుకు ముందే సిద్ధం చేసిన హెచ్‌ఈసీ.. 2022 డిసెంబర్‌లోనే వాటిని ఇస్రోకు అందజేసింది. అయితే హెచ్ఈసీలో పనిచేసే ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌లకు గత 17 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఐఏఎన్‌ఎస్ వార్తాసంస్థ తాజాగా వెల్లడించింది. అయితే హెచ్ఈసీలో పనిచేసే 3 వేల మందికి జీతాలు ఇవ్వకున్నా గడువుకు ముందే కీలక పరికరాలు, సామగ్రిని ఇస్రోకు అందంచినట్లు తెలిపింది. జీతాల చెల్లింపుల్లో సమస్య ఉన్నా లాంచ్‌ప్యాడ్ సహా ఇతర కీలక సామాగ్రిని ముందే డెలివరీ చేసినట్లు పేర్కొంది.
ఈ హెచ్‌ఈసీ అనే ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే హెచ్ఈసీ సంస్థలో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించవడం లేదంటూ ఏడాది కాలంగా వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి. హెచ్ఈసీలో పనిచేసే 2700 మంది వర్క్‌మెన్లు, 450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు 14 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఫ్రంట్‌లైన్ సంస్థ మే నెలలో పేర్కొంది. హెచ్ఈసీలోని ఆఫీసర్లకు ఏడాదికిపైగా, మిగిలిన ఉద్యోగులకు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని 2022 నవంబర్‌లో ఐఏఎన్‌ఎస్ నివేదిక విడుదల చేసింది. దాదాపు రూ. 1500 కోట్ల విలువైన ఆర్డర్లు.. ఇస్రో, రక్షణ శాఖ, రైల్వే, కోల్ ఇండియా నుంచి వచ్చినప్పటికీ.. నిధుల కొరత కారణంగా 80 శాతం పనులు హెచ్ఈసీలో నిలిచిపోయాయని పేర్కొంది.
అయితే తమకు రూ.1000 కోట్ల నిధులు అందించాలని హెచ్‌ఈసీ ఎన్నోసార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పాటు గత రెండున్నర సంవత్సరాలుగా హెచ్‌ఈసీలో కీలకమైన సీఎండీ పదవి ఖాళీగా ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలుపుతోంది. అయితే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల సంతోషంగా ఉందని హెచ్‌ఈసీ ఇంజినీర్ సుభాష్ చంద్ర పేర్కొన్నారు. దీంతో ఈ ప్రయోగంలో పాలు పంచుకున్న హెచ్‌ఈసీ ఉద్యోగులకు ఇది గర్వకారణమని తెలిపారు. దేశానికి అత్యంత ముఖ్యమైన ప్రయోగంలో తాము కూడా భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply