[ad_1]
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం దశల వారీగా విజయం సాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా నిర్ణయించిన ప్రకారం అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23 వ తేదీన జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనుంది. ఇందులో భాగంగా తాజాగా చివరి ఘట్టం మొదలైంది. చంద్రయాన్ 3 లోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ సక్సెస్‌ఫుల్‌గా విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. ఇక నుంచి సొంతంగా చంద్రుడి చుట్టూ తిరగనుంది. ఇది కాస్త క్రమంగా చంద్రుడి ఉపరితలంపైకి చేరి.. చివరికి ల్యాండర్ దిగి.. అందులో నుంచి రోవర్ బయటికి రానుంది. అనంతరం ఆ రోవర్ చంద్రుడి ఉపరితలంపై ప్రయాణించి.. ఫొటోలు, వీడియోలు తీసి ప్రయోగాలు జరిపి.. వాటిని ఇస్రోకు అందించనుంది.
[ad_2]
Source link
Leave a Reply