Chandrayaan 3: చంద్రునిపైకి చేరేందుకు ఒక్క అడుగే.. చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక దశ పూర్తి

[ad_1]

Chandrayaan 3: చంద్రునిపై ప్రయోగాలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని జులై 14 వ తేదీన విజయవంతంగా చేపట్టింది. ఆ తర్వాతి రోజు నుంచే క్రమంగా చంద్రయాన్ – 3 కక్ష్యను పెంచుకుంటూ వెళ్తున్న ఇస్రో.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. జాబిల్లిని చేరేందుకు దగ్గరవుతోంది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ – 3 కక్ష్యను తాజాగా ఐదోసారి ఇస్రో పెంచింది. అయితే భూమి చుట్టూ తిరగనున్న ఈ చంద్రయాన్ – 3 కి ఇదే చివరి కక్ష్య కావడం విశేషం. దీని తర్వాత చంద్రయాన్ – 3 చంద్రుని కక్ష్యలోకి వెళ్లనుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 1 వ తేదీన జరగనుంది.

బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ నుంచి ఈ ఐదోసారి కక్ష్య పెంపు చేసే ప్రక్రియను ఇస్రో చేపట్టింది. తాజాగా కక్ష్య పెంచడంతో ప్రస్తుతం చంద్రయాన్‌ 127609 కిలోమీటర్లు x 236 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇది భూ కక్ష్య పరిధిలో చివరిది కాగా.. తర్వాత చంద్రయాన్ – 3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించనుందని పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ప్రయోగం సజావుగా సాగితే ముందుగా అనుకున్న తేదీ ప్రకారం ఆగస్టు 23 వ తేదీన సాయంత్రం.. జాబిల్లిపై చంద్రయాన్ – 3 లోని ల్యాండర్ ల్యాండ్ అయి.. రోవర్‌ను కిందికి దించనుంది. ఇదే గనక జరిగితే చంద్రుని దక్షిణ ధ్రువంపైకి దిగిన తొలి దేశంగా భారత్ నిలవనుంది.

చంద్రుని కక్ష్యలోకి చేరిన తర్వాత జాబిల్లి దిశగా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్‌ -3 ని ఇస్రో పంపించనుంది. అక్కడ చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వెళ్లిన అనంతరం లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ జరగనుంది. ఇందులో భాగంగా ఇంజిన్‌ను మండించి చంద్రయాన్‌ – 3 వేగాన్ని క్రమంగా తగ్గిస్తారు. దీంతో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపట్టి.. చంద్రయాన్ – 3 జాబిల్లి కక్ష్యలో తిరగడం ప్రారంభిస్తుంది. దాని తర్వాత ఆగస్టు 23 లేదా 24 వ తేదీల్లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి.. ల్యాండర్‌, రోవర్‌ విడిపోయి.. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలం వైపు ప్రయాణిస్తుంది. 4 ఇంజిన్ల సాయంతో క్రమంగా వేగాన్ని తగ్గించి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్‌ దిగుతుందని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్ -2 ప్రయోగంలో కూడా విజవంతంగా చంద్రుని కక్ష్యలోకి చేరినా.. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా క్రాష్ ల్యాండింగ్ కావడంతో ప్రయోగం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే మరోసారి అలాంటి తప్పిదాలు, పొరపాట్లు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈసారి చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టారు. చంద్రునిపైకి మానవ సహిత రాకెట్లను పంపేందుకు ఈ చంద్రయాన్ – 3 ప్రయోగం ఇస్రోకు ఎంతో కీలకం కానుంది.
Chandrayaan 3: ఏడాదిన్నరగా అందని జీతాలు.. అయినా చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలకపాత్ర

Chandrayaan 3: సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3.. సగర్వంగా 140 కోట్ల భారతీయులు
Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *