Chandrayaan-3: వచ్చే వారం తెరుచుకోనున్న చంద్రయాన్-3 నాలుగో కన్ను

[ad_1]

చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్-3 (Chandrayaan 3) విక్రమ్ ల్యాండర్‌‌లో ( Vikram Lander) అమర్చిన నాల్గో పేలోడ్ లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే (LRA).. జాబిల్లిపై పగటి సమయం ముగిసిన తర్వాత తన పనిని మొదలుపెడుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ (Pragyan Rover) లోని సాధనాలు నిద్రాణస్థితిలోకి వెళ్లిన తర్వాత ఎల్ఆర్ఏను ఇస్రో (ISRO) యాక్టివ్ చేయనుంది. ఎల్ఆర్ఏ తప్ప విక్రమ్‌లోని మిగతా మూడు పేలోడ్‌‌లు రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్పియర్ అండ్ అట్మాస్పియర్ (రాంభ), చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (చాస్టే), ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ (ఇల్సా) ప్రస్తుతం చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.

ఇక, ఎల్‌ఆర్‌ఎ నాసా గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రూపొందించింది. LRA అనేది కక్ష్యలోని అంతరిక్ష నౌక కాంతి నుంచి పరావర్తనం చెందిన కాంతిని ఉపయోగించుకునేలా రూపొందించారు. సాధారణంగా ఒక లేజర్ ఆల్టిమీటర్ లేదా లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లిడార్) ల్యాండర్ స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి ఆర్బిటర్‌కు సంబంధించి చంద్ర ఉపరితలంపై విశ్వసనీయమైన కేంద్రం. రెట్రో రిఫ్లెక్టర్లు నేరుగా ల్యాండర్ నుంచి తిరిగి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తాయి. కొన్ని వందల కిలోమీటర్ల నుంచి కక్ష్యలో ఉన్న లేజర్ ఆల్టిమీటర్ లేదా లిడార్ ద్వారా వీటిని గుర్తించవచ్చు.

నాసా ప్రకారం.. విక్రమ్‌లోని LRA ఎనిమిది వృత్తాకార 1.27 సెం.మీ వ్యాసం కలిగిన క్యూబ్ రెట్రోరెఫ్లెక్టర్ల మూలలో 5.11cm వ్యాసం, 1.65cm ఎత్తులో ఉన్న అర్ధగోళాకార గోల్డ్ పెయింటెడ్ వేదికపై అమర్చబడి ఉంటుంది. ప్రతి రెట్రో రిఫ్లెక్టర్లు కొద్దిగా భిన్నమైన దిశలో… గరిష్టంగా +-20 డిగ్రీల కాంతి పరావర్తన కోణంలో ఉంటాయి. LRA మొత్తం ద్రవ్యరాశి 20 గ్రాములు కాగా.. పనిచేయడానికి విద్యుత్ అవసరం లేదు.

నాసా స్పేస్ సైన్స్ డేటా కో-ఆర్డినేటేడ్ ఆర్కైవ్ హెడ్ డేవిడ్ విలియమ్స్ మాట్లాడుతూ.. ‘చంద్రయాన్ మిషన్ పూర్తయ్యే వరకు ఎల్‌ఆర్‌ఎను వినియోగించాలని అనుకోలేదు’ అన్నారు. చంద్రయాన్-3 మిషన్ పూర్తయ్యే వరకు ఎల్‌ఆర్‌ఏ ఎందుకు పనిచేయదు అనేదానిపై విలియమ్స్, ఇతర ఎల్‌ఆర్‌ఏ బృంద సభ్యులను ఉటంకిస్తూ.. ల్యాండర్‌లోని ఆప్టికల్ పరికరాల (కెమెరాలు, స్పెక్ట్రోమీటర్లు) ఆపరేషన్‌లో జోక్యం చేసుకోకుండా చూసుకోవాలని అన్నారు.

‘LRA ఒక కక్ష్యలో ఉన్న అంతరిక్ష నౌక నుంచి ఉపరితలంపై దాని స్థానాన్ని చాలా ఖచ్చితంగా తెలియజేస్తుంది.. ఇది భూమికి ఉన్న దూరం గురించి ఖచ్చితమైన కొలతను అందజేయడానికి అంతరిక్ష నౌక స్థానం చుట్టూ పరిభ్రమించే డేటాతో కలిపి ఉంటుంది.. ఇది భూమికి సంబంధించి చంద్రుని కదలిక వివరాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది… చంద్రుడి ఉపరితలంపై అనేక LRAలను ఉంచిన తర్వాత అవి విశ్వసనీయ గుర్తులుగా ఉపయోగపడతాయి.. ఉపరితలంపై జియోడేటిక్ (సర్వేయింగ్ కోసం జియోడెసీ) నెట్‌వర్క్‌ను సృష్టించగలవు.. భవిష్యత్ మిషన్ల ఖచ్చితమైన ల్యాండింగ్‌లను ప్లాన్ చేయడంలో ఇది సహాయపడుతుంది’ అని విలియమ్స్ చెప్పారు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *