Chandrayaan 3: వైఫల్య ఆధారిత డిజైన్ వినియోగించిన ఇస్రో.. ఎందుకలా?

[ad_1]

చంద్రుడిపై (Moon) అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జులై 14న ఎల్‌ఎంవీ-3పీ4 రాకెట్‌ ద్వారా శ్రీహరికోటలో సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం (SHAR)నుంచి చంద్రయాన్-3ను ప్రయోగించనున్నారు. 2019లో చంద్రయాన్‌-2 (Chandrayaan-2) ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈసారి దీన్ని మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఇస్రో వెల్లడించింది. ఇప్పటి వరకూ చంద్రుడి ఉపరితలంపై అమెరికా, చైనా, రష్యాల మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దేశాల సరసన నిలవాలని ఊవిళ్లూరుతోంది. 2019లో చంద్రయాన్-2తో ఆ కలను సాకరం చేసుకోడానికి భారత్ చేసిన ప్రయత్నాలు చివరి క్షణంలో విఫలమయ్యాయి. కానీ, ఈసారి మాత్రం కచ్చితంగా దానిని సాధించి తీరుతామని ఇస్రో శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు.

ఎస్‌ఐఏ సోమవారం నిర్వహించిన ఇండియా స్పేస్‌ సైన్స్‌ కాంగ్రెస్‌‌లో ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ (ISRO Chief Somanath)మాట్లాడుతూ.. చంద్రయాన్‌-2తో పోలిస్తే చంద్రయాన్‌-3ని వైఫల్య ఆధారిత విధానంలో రూపొందించామని స్పష్టం చేశారు. అలాగే దీనిలో అధిక ఇంధనం వినియోగించామని, ల్యాండర్‌ను కూడా మరింత బలంగా రూపొందించామని పేర్కొన్నారు. సాఫ్ట్ ల్యాండిగ్ విషయంలో మరిన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

‘చంద్రయాన్‌-2లో పారామీటర్‌ వైవిధ్యం లేదా వ్యాప్తిని నిర్వహించే సామర్థ్యం చాలా తక్కువ.. అందుకే ఈసారి ఆ సామర్థ్యాన్ని పెంచాం. చంద్రయాన్‌-2ని సక్సెస్‌ ఆధారిత మోడల్‌లో (Success Based Model) రూపొందించగా.. చంద్రయాన్‌-3ని మాత్రం ఫెయిల్‌-సేఫ్‌ విధానంలో (Failure Safe Model)డిజైన్‌ చేశాం.. అంటే సెన్సార్, ఇంజిన్, అల్గారిథమ్, కాలిక్యులేటర్ ఇలా ఏదైనా వ్యవస్థ విఫలమైనప్పుడు దాన్ని ఎలా రక్షించాలి అనే విధానాన్ని అనుసరించి ప్రోగ్రామింగ్ నిర్వహించాం..’ అని సోమనాథ్‌ వెల్లడించారు.

ఇందులో చంద్రుడిపై భూకంపం, రెగోలిత్‌, ఉపరితల ప్లాస్మా, పర్యావరణం, మూలకాల కూర్పునకు సంబంధించిన ధర్మోఫిజికల్‌ లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రీయ పరికరాలు అమర్చామని తెలిపారు. దీనిలోని ల్యాండర్‌ చంద్రునిపై దిగగానే.. రోవర్‌ బయటకు వచ్చి చుట్టుపక్కల కలియతిరుగుతూ ఉపరితలంపై రసాయనక విశ్లేషణ చేస్తుంది.

ఎలాంటి పరిస్థితుల్లోనూ చంద్రయాన్‌-3 ల్యాండర్‌ సాఫీగా చంద్రుడిపై దిగేలా చూడాలన్నది మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈసారి ల్యాండింగ్‌కు లక్ష్యంగా కొంత విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు. చంద్రయాన్‌-3లో ఇంధన పరిమాణాన్నీ పెంచామని, అందువల్ల అవసరమైతే అది ప్రత్యామ్నాయ ల్యాండింగ్‌ ప్రదేశానికి తరలివెళ్లగలదని వ్యాఖ్యానించారు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *