Chandrayaan 3: సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3.. సగర్వంగా 140 కోట్ల భారతీయులు

[ad_1]

Chandrayaan 3: చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్ – 3 రాకెట్ చంద్రయాన్ – 3 ని మోసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బయల్దేరింది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3 యాత్రలో భాగంగా ఈ రాకెట్‌ జాబిల్లి వద్దకు ప్రయాణం ప్రారంభించింది.

ఈ జీఎస్ఎల్వీ మార్క్ – 3 రాకెట్‌ చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని భూమి చుట్టూ ఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగి.. అనంతరం క్రమంగా దాని కక్ష్యను పెంచుకుంటూ పోతుంది. ఆ తర్వాత క్రమంగా చంద్రుడి వైపు ప్రయాణించే కక్ష్యలోకి చేర్చనున్నారు. చివరకు చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఈ చంద్రయాన్ – 3 ని పంపిస్తారు. ఆగస్టు 23 లేదా 24 వ తేదీన ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌తో కూడిన మాడ్యూల్‌ విడిపోనుంది. అప్పుడు చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం దగ్గర దిగనుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

చంద్రయాన్-3 సక్సెస్ కావాలని తిరుపతిలో ప్రత్యేక పూజలు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *