[ad_1]
2019 లో ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడి దగ్గరి వరకు వెళ్లిన చంద్రయాన్ 2.. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి.. క్రాష్ ల్యాండింగ్ అయింది. అయితే ఆ చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపైకి పంపించిన ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. అందుకే ఆర్బిటర్ లేకుండానే చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఆర్బిటర్‌తో చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్‌ను సక్సెస్‌ఫుల్‌గా లింక్ చేశారు. దీనికి సంబంధించి తాజాగా ఇస్రో ఒక ట్వీట్ చేసింది.
వెల్‌కమ్ బడ్డీ అంటూ.. చంద్రయాన్ 2 ఆర్బిటర్.. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్‌ను అధికారికంగా స్వాగతించిందని ట్వీట్‌లో ఇస్రో వెల్లడించింది. ఆర్బిటర్, ల్యాండర్ మాడ్యూల్ మధ్య పరస్పరం డేటా ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ఏర్పాటు అయినట్లు తెలిపింది. ల్యాండర్ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్కింగ్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. మరోవైపు.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5.20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో పేర్కొంది.
చంద్రుడిపై కాలుపెట్టేందుకు 2019 జులై 22 వ తేదీన చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇస్రో నింగిలోకి పంపించింది. ఈ చంద్రయాన్ 2 లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో కూడిన జీఎస్‌ఎల్వీ మార్క్111 ఎం1 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఆగస్టు 20 వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 2.. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే కొన్ని క్షణాల ముందు ఫెయిల్ అయ్యింది. ఈ మేరకు జాబిల్లిపై క్రాష్ ల్యాండింగ్ జరిగినట్లు గుర్తించిన ఇస్రో.. ఆ ప్రయోగం విఫలమైందని ప్రకటించింది. అయితే 8 సాంకేతిక పరికరాలను కలిగి ఉన్న ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఆర్బిటర్‌లో ఏడేళ్లకు సరిపడా ఇంధనం ఉందని.. ఇస్రో అప్పట్లోనే తెలిపింది. ఈ కారణంగానే చంద్రయాన్ 3 లో ఆర్బిటర్‌ను ఇస్రో పంపలేదు.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply