[ad_1]
చంద్రుడిపై ల్యాండర్ దిగిన అనంతరం ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 విజయం కోసం కృషి చేసి ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ‘దేశం కోసం స్ఫూర్తిదాయక విజయం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు.. ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు.. చంద్రయాన్-3 విజయవంతం కావాలని కొన్ని రోజులుగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సాఫ్ట్ ల్యాండింగ్ అంత సులభమైన విషయం కాదు. వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరం. చంద్రయాన్-3ని ప్రతి భారతీయుడు ఎంతో ఆసక్తికగా చూస్తారు. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు.’ అని అన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన అంశం ఏంటని ప్రశ్నించగా.. ‘మిషన్‌లో అత్యంత కష్టతరమైన భాగం ప్రయోగమే… అంతరిక్ష నౌక GSLV మార్క్ 3 (విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను కలిగి ఉన్న చంద్రయాన్-3 మాడ్యూల్‌ను ప్రయోగించిన రాకెట్) సరైన కక్ష్యకు చేర్చిన విషయం మర్చిపోకూడదు.. ఇది 36,500 కి.మీ, ట్రాన్స్-లూనార్ కక్ష్య (ఇది చంద్రునికి ఒక పథంలో అంతరిక్ష నౌకను సెట్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రొపల్సివ్ కదలిక) దశ వరకు వెళ్లి.. ఈ ప్రక్రియ చాలా బాగా జరిగింది’ అని సోమనాథ్ చెప్పారు.
చంద్రయాన్-3 మాడ్యూల్ ప్రయోగించిన 16 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయింది.. భూమి చుట్టూ ఆరుసార్లు ప్రదక్షిణ చేసింది.. జూలై 15 న మొదటి కక్ష్యకు గరిష్టంగా 36,500 కి.మీ దూరానికి చేరింది. ‘చంద్రునిపై ల్యాండింగ్, క్యాప్చర్ చేయడం రెండో అతి క్లిష్టమైంది… మీరు దానిని మిస్ అయితే అది (చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ అవకాశం) పోయింది.. మీరు దానిని తిరిగి చూడలేరు’అని సోమనాథ్ వివరించారు.
చంద్రుడి కక్ష్య నుంచి డీబూస్ట్ చేసిన తర్వాత ల్యాండింగ్ సైట్‌ను ఇస్రో అంతర్గతంగా అభివృద్ధి చేసిన హైరిజల్యూషన్ కెమెరాలు సహకరించాయి. ఈ దశ కూడా చాలా కీలకమైంది. ఎందుకంటే విక్రమ్ ల్యాండర్ దిగడానికి ప్రయత్నించినప్పుడు క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ‘మూడో క్లిష్టమైన క్షణం ల్యాండర్, ఆర్బిటర్‌ను వేరు చేయడం.. ఇది తగిన సమయంలో జరిగింది.. చాలా రోజులు అంతరిక్షం, చంద్రుడి కక్ష్యలో గడిపిన తర్వాత జరిగిందని మీరు గుర్తుంచుకోవాలి.. ఇస్రో యంత్రాంగం సమస్యలు లేకుండా పని చేయాల్సి వచ్చింది.’ అని వివరించింది.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply